ఎం.వై.ఎస్. ఫంక్షన్ హాల్ లో మహిళా చట్టాలు, హక్కులు, సమస్యలపై అవగాహన కార్యక్రమం : రాష్ట్ర మహిళా కమిషన్ గౌరవ సభ్యురాలు కొమ్ము ఉమాదేవి యాదవ్, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన          Dt:27.01.2022, వనపర్తి.

మహిళలను గౌరవిస్తూ ముందుకు సాగిన నాడే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ గౌరవ సభ్యురాలు కొమ్ము ఉమాదేవి యాదవ్ అన్నారు.
గురువారం పట్టణంలోని ఎం వై ఎస్ ఫంక్షన్ హాల్ లో మహిళా, శిశు, దివ్యాంగ, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా చట్టాలు, హక్కులు, సమస్యలపై అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషతో కలిసి ఉమాదేవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటిలో కుటుంబాన్ని ఎలా గౌరవించుకుంటామో సమాజంలో ఉన్న వారిని కూడా మనం గౌరవించుకోవాలి అని ఆమె అన్నారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడానికి మహిళా కమిషన్ కృషి చేస్తుందని ఆమె తెలిపారు. కమిషన్ సభ్యురాలిగా ఉండి రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేసి, నేడు సమాజంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. తాను గతంలో సింగరేణి కాలరీస్ లో మహిళల సమస్యలపై ఉద్యమాలు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం తాను కమిషన్ సభ్యురాలిగా నియామకం అయిన దగ్గర నుండి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ సమాజంలో మార్పు తీసుకురావాలంటే మొదట తన ఇంటిలో నుండి మార్పు రావాలని ఆడ, మగ అనే తేడా లేకుండా పురుషులను, మహిళలను సమానంగా గౌరవించాలని ఆమె అన్నారు. మహిళలపై ఏదైనా దాడులు జరిగితే వాటిని నిరోధించడానికి మహిళా సంఘాలు, పోలీసులు ఉన్నారని అనుకోరాదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆమె సూచించారు. మహిళలు ఎందులోనూ తీసిపోరని, పురుషులు ఎక్కువ, మహిళలు తక్కువ అనే తేడాలు ఉండరాదని ఆమె అన్నారు.  ఒక పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉందన్న సత్యం నేటి వరకు జరుగుతున్నదని, మహిళలు ఏ రంగంలో అయినా ముందుకు వెళ్ళగలిగే ధైర్య సాహసాలు వారికి ఉంటాయని, కుటుంబ ప్రోత్సాహం మహిళలకు అవసరమని ఆమె సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, జిల్లా సంక్షేమ అధికారి పుష్పలత. సిడబ్ల్యుసి చైర్ పర్సన్ అలివేలమ్మ, జెడ్ ఎమ్ ఎస్ అధ్యక్షురాలు ఇందిరా, ఏవో డి రేణుక, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, జెడ్ పి టి సి రాజేంద్ర ప్రసాద్, బి ఆర్ డి కోఆర్డినేటర్ కృష్ణ చైతన్య, డి సి పి ఓ రాంబాబు, కోళ్ల వెంకటేష్, సిడిపిఓలు సూపర్వైజర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
…………
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post