ఎక్కడో ఇతర రాష్ట్రంలో పండించిన కూరగాయలు జిల్లా కేంద్రం లో అమ్మే బదులు మన సొంత పంట పొలంలో పండించి విక్రయించాలని జిల్లా కలెక్టర్ డి హరిచందన రైతులను కోరారు.
సోమవారం జిల్లా కలెక్టర్ డి హరిచందన దామరగిద్ద మండలం ఉడ్మల్ గిద్ద గ్రామంలో రైతులతో పంటల సాగు పై రైతులతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో ప్రజల అవసరాలకు సరిపడా కూరగాయలు లేక ఇతర జిల్లాలలో , ఇతర రాష్ట్రాలలో పండించిన కూరగాయలు తెచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుందని, దానికి బదులుగా ఇక్కడే మన పంట పొలాల్లో మనకు కావాల్సిన కూరగాయలు పండించి మిగిలినవి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేవిధంగా రైతులు సమాయత్తం కావాలని సూచించారు. గ్రామాలలో కూరగాయలు పండించి జిల్లా కేంద్రం లో అమ్మి లాభ పడా లని రైతులకు సూచించారు. మార్చి నాటికి ఎండలు అధికంగా ఉండటంతో యాసంగిలో వేసే వరి ఎక్కువ శాతం ముక్కలు అయ్యే అవకాశం ఉండటంతో దానిని ఉప్పుడు బియ్యంగా మార్చాల్సి ఉంటుందన్నారు. ఉప్పుడు బియ్యం కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేనందున రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలు పెట్టడం లేదన్నారు. అందువల్ల యాసంగి లో వరి కి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. వరి కి బదులు కూరగాయ తోటలు పెట్టుకోవచ్చని NIEGS కింద సబ్సిడీ ని ఇవ్వడం జరుగుతోందని పెసర, మినుము, కంది వంటి పప్పు ధాన్యాలు, వివిధ రకాల కురగాయలు పండించాలని సూచించారు. అలాగే ఎవైరనా ముందుకు వచ్చి ఆయుర్వేద మొక్కలైన అస్వగంద, లెమన్ గ్రాస్స్, శతావరి మరియు నన్నారి సాగు చేయాలనుకునే వారికి ప్రభుత్వంచే సహాయ సహకారాలు అందించడం జరుగుతోందని తెలిపారు. రైతులు పండించే పంటలకు ప్రభుత్వం ద్వార మార్కెటింగ్ కై పూర్తి సహకారం అందిస్తుందన్నారు. అసక్థి గల రైతులు ముందుకు వస్తే పంటల పై అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగాతదన్నారు. ఎలాంటి అనుమానాలు ఉన్న వ్యవసాయ అధికారుల ద్వార నివృత్తి చేసుకోవాలని తెలియజేసారు. సౌడు, బురుద భూముల లో సైతం మంచి లాభసాటి మొక్కలు పెంచుకోవచాన్నారు. ఈ నేలాఖరి వరకు రాగులు, చేమగడ్డ, ఇలా కూరగాయల మొక్కలు చాల పండిన్చావచ్చాన్నారు. న్యూట్రీషన్లు, ప్రోటిన్ కలిగిన మొక్కల వలన చిన్న పిల్లలకు ఆరోగ్యవంతులవుతారని తెలిపారు. వాటిని పండించి రైతులు లాభాలను గడించాలని సూచించారు. పంట మార్పిడి జరిగినపుడే మంచి లాభాలు వస్తాయని పేర్కొన్నారు. ఈ కాలంలో దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదు కాబట్టి ముందస్తుగా అలోచించి వివిధ రకాల ప్రత్యామ్నాయ పంటలు పండించాలని అందరు ఒకేరకం పంటను పండించడం వలన నష్టం వాటిల్లుతోందన్నారు. కుర గయా తోటలతో పాటు పండ్ల మొక్కలు పెంచడం వలన కూడా చాల లాభాలు ఉన్నాయన్నారు. నీటి సౌకార్యం లేకుండా పండించే మొక్కలు కూడా ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, జిల్లా గ్రామినభిరుద్ది శాఖా అధికారి గోపాల్ నాయక్, DPM రాము నాయక్, mpdo శేశికళ మరియు గ్రామా ప్రజలు తదితరులు పాల్గొన్నారు.