ఎక్కువ యూనిట్ లు నెలకొల్పి మహబూబాబాద్ జిల్లాను ఎగుమతి జిల్లాగా మార్చాలి — జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ప్రచురణార్ధం

మహబూబాబాద్ జిల్లాను ఎగుమతి జిల్లాగా మార్చాలి — జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

మహబూబాబాద్, ఆగస్ట్-18:

బుధవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ టిఎస్-ఐపాస్ ద్వార పరిశ్రమల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో సమీక్షించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మహబూబాబాద్ జిల్లాలో ఎక్కువ యూనీట్లు నెలకొల్పుటకు దోహదపడి, మన జిల్లా అవసరాలతో పాటు, ఇతర ప్రాంతాల అవసరాల కొరకు ఎగుమతి చేసే జిల్లాగా మార్చాలని సూచించారు.  

దరఖాస్తు చేసుకున్న వెంటనే పరిశీలించి అభ్యర్ధికి యునిట్ స్థాపన కొరకు అనుమతులు జారీ చేయాలని, జాప్యం చేయరాదని సూచించారు.  గ్రానైట్, చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్, ఇతర యూనిట్ల స్థాపనలో ఏమైన సమస్య వచ్చిన పక్షంలో తన దృష్టికి తీసుకొని రావలని సూచించారు.

టిఎస్-ఐపాస్ ద్వారా యూనిట్ల స్థాపన కొరకు 69 ధరఖాస్తులు రాగా, 47   దరఖాస్తులను  ఆమోదించడం జరిగిందని, 4 ధరఖాస్తులను తిరస్కరించగా, మిగతావి వివిద దశలో ఉన్నాయని సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ కు తెలిపారు. 

ఈ సమీక్షా సమావేశంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, టి.ఎస్.ఎన్.పిడి.సి.ఎల్., పరిశ్రమలు, టౌన్ కంట్రీ ప్లానింగ్, గ్రౌండ్ వాటర్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
————————————————————————————జిల్లా పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్ కార్యాలయం చే జారీ చేయనైనది.

Share This Post