ఎక్స్పోర్ట్ క్వాలిటీ గల ఉత్పత్తులను తయారు చేయాలి -జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సెప్టెంబర్ 25, 2021ఆదిలాబాదు:-

            జిల్లాలోని పరిశ్రమల యజమానులు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసేవిధంగా వ్యాపారం చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆజాది కా అమృత్ మహోత్సవం సందర్బంగా శనివారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో కేంద్ర ప్రభుత్వ కామర్స్, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న వాణిజ్య ఉప్తత్తుల ఎగుమతుల పై జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వివిధ ఉత్పత్తిదారులు, పరిశ్రమల దారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లా పత్తి పంటకు పెట్టింది పేరు అని, నాణ్యతతో కూడిన, ఎగుమతి చేసేవిధంగా పత్తి పంట సాగు అవుతున్నదని, అట్టి పంటను వివిధ దేశాలకు ఎగుమతులు చేసేవిధంగా పరిశ్రమల దారులను పరిశాశ్రమాల శాఖ అధికారులు ప్రోత్సాహం కల్పిస్తూ, అవసరమైన ఏర్పాట్లు శిక్షణలు నిర్వహించాలని అన్నారు. అదేవిధంగా చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమల వారికీ చేయూతనందించాలని, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారు. శుబ్రపరిచే రసాయనాలు, మసాలా దినుసులు, చేతి సంచులు, బిస్కెట్ తయారీ, ఇతర నిత్యావసర సరుకులు ఉత్పత్తి, సరఫరా చేసేవారికి ప్రోత్సాహకాలు అందించాలని పరిశ్రమల శాఖ అధికారికి సూచించారు. కేంద్ర ప్రభుత్వం నేతృత్వం లో జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా నుండి ఇతరప్రాంతాలకు ఎగుమతులు చేసేవిధంగా పరిశ్రమలు నేపకొల్పాలని అన్నారు. జిల్లా అధికారులతో కుటీర పరిశ్రమల దారులకు సమన్వయ పరుస్తూ వారు ఉత్పత్తి చేసే వాటిని ప్రభుత్వ కార్యాలయాలు, వసతి గృహాలు, ఆసుపత్రులు, మున్సిపాలిటీ, పంచాయితీ లలో వినియోగించే విధంగా ఏర్పాట్లు చేయాలనీ సూచించారు. తొలుత పట్టణంలోని పత్తి జిన్నింగ్ మిల్లుల యజమానులతో మాట్లాడుతూ, వారికీ ఉన్నటువంటి సమస్యలను తెలియపరచాలని, ప్రభుత్వ పరంగా వీలైనంత వరకు సహకారం అందించే విధంగా ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. ఈ సందర్బంగా పలువురు జిన్నింగ్ మిల్లుల యజమానులు మాట్లాడుతూ, జిల్లాలోని పత్తి పంటను కొనుగోలు చేసేవిధంగా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, నాణ్యమైన పత్తి లభించినప్పటికీ ఆశించినంత ప్రగతి సాధించా లేక పోతున్నామని, రవాణా ఖర్చులు అధికంగ ఉండడం, జిన్నింగ్ మిల్లుల్లో నైపుణ్యత లేని కార్మికులు ఉన్నారని, సాంకేతిక పరమైన శిక్షణ అవసరమని అన్నారు. జిన్నింగ్ మిల్లుల్లో పనిచేసేవారికి సంబంధిత డిప్లొమా, స్పిన్నింగ్ మిల్లుల్లో పనిచేసే వారికీ టెక్స్ టైల్స్ ఇంజనీరింగ్ లో విద్యార్హత ఉండవలసి ఉందని అన్నారు. ప్రభుత్వ పరంగా సబ్సిడీలు, మార్కెటింగ్ సౌకర్యం, శాంపిల్స్ కలెక్షన్ ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలనీ కలెక్టర్ కు సూచించారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పద్మభూషణ్ రాజు మాట్లాడుతూ, జిల్లాలో ఉత్పత్తులు ఉన్నప్పటికీ, వివిధ కంపెనీల పోటీ పరంగా మార్కెటింగ్ సౌకర్యం కలగడం లేదని అన్నారు. అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించి స్థానికంగా ఉత్పత్తి అయ్యే నిత్వావసర సరుకులను వినియోగం లోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కార్యక్రమం కింద పత్తి పంటను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ సహాయ సంచాలకులు మధుసూదన్ చారి, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి శ్రీనివాస్, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, పరిశ్రమల యజమానులు, కుటీర పరిశ్రమల దారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post