ఎటువంటి సమస్య రాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరగాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియపై గురువారం పౌర సరఫరాలు, పౌర సరఫరాల సంస్థ, డిఆర్డిఓ, సహాకార, వ్యవసాయ, మార్కెటింగ్, జిసిసి, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జి టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియ సజావుగా సక్రమంగా రైతులకు ఇబ్బంది కలుగకుండా జరగాలని చెప్పారు. రైతన్నలు ధాన్యాన్ని బాగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తేవాలని తెలిపారు. వాతారణంలో ప్రతికూల పరిస్థితులున్నాయని, వర్షాలు వచ్చే అవకాశం ఉన్నదని ధాన్యం తడవకుండా జాగ్రత్త చేయాలని చెప్పారు. కొనుగోలు ప్రక్రియలో జాప్యం చేయొద్దని, రైతులు విక్రయానికి వచ్చిన తరువాత వేచియుంచకుండా కొనుగోలు చేస్తామనే ధోరణి వద్దని సర్వం సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. షెడ్యూలు ప్రకారం ధాన్యం విక్రయాలు నిర్వహణకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతుల నుండి ధాన్యం నమూనాలను పరిశీలించి తేదీల వారిగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే విధంగా ముందస్తుగా టోకెన్లు జారీ చేయాలని చెప్పారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో తేమ శాతం కొలిచే యంత్రాలు, టార్పాలిన్లు, ధాన్యం శుబ్రపరచే, తూకము వేసే యంత్రాలు, విద్యుత్ ఏర్పాట్లుతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ధాన్యం నిల్వలు తడవకుండా టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలని, టార్పాలిన్లు లేకపోతే దాన్యం తడిసి తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు చెప్పారు. రైతులు ధాన్యం విక్రయాలు నిర్వహణలో తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించు విధంగా క్లస్టర్ వారిగా అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కొనుగోలు తేదీని తెలియచేస్తూ రైతులకు ముందస్తుగా టోకెన్లు జారీ చేయాలని చెప్పారు. రైతులకు జారీ చేసిన టోకెన్లు వారిగా కొనుగోలు కేంద్రాలకు రావాలని, ఆ ప్రకారమే రావడం వల్ల కొనుగోలు కేంద్రాల రద్దీ నియంత్రణ ఉంటుందని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రం ఇన్చార్జిదేనని అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కొనుగోలు జరిగిన తరువాత దాన్యాన్ని రవాణా చేసేందుకు వాహనాలు అందుబాటులో ఉండే విధంగా చూడాలని చెప్పారు. రైతుల రిజిస్ట్రేషన్ అవసరమని ఆధార్ అనుసంధానం చేయాలని చెప్పారు. విక్రయాలు నిర్వహించే రైతుల యొక్క ఆధార్కార్డుకు మొబైల్ అనుసంధానం చేయాలని చెప్పారు. ఆధార్ అనుసంధాన ప్రక్రియను ప్రక్రియను ముమ్మరంగా పూర్తిచేసేందుకు క్యాంపులు నిర్వహించాలని చెప్పారు. రెవిన్యూ గ్రామం వారిగా మొబైల్ ఆధార్ అనుసంధానం చేసిన జాబితాను సిద్ధం చేయాలని, ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియని చెప్పారు. సహాకారశాఖ ద్వారా 108, డిఆర్డిఓ 11, జిసిసి ద్వారా 29 కేంద్రాలు, మార్కెటింగ్ శాఖ ద్వారా 6 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చెల్లిస్టు ప్రకారం కొనుగోలు కేంద్రాలు సంసిద్ధంగా ఉండాలని, తనిఖీలు నిర్వహణలో ఏర్పాట్లుతో లోటుపాట్లు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేయగానే రైతు యొక్క వివరాలు ఓపియంఎస్ చేయాలని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పాటించుటపై క్లస్టర్ వారిగా రైతులకు అవగాహన కల్పనకు గోడపత్రికలు ద్వారా ప్రచారం నిర్వహించాలని చెప్పారు. మిల్లరుల్లో సత్వరం ధాన్యం దిగుమతి చేయు విధంగా హామాలీలను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో గన్నీ సంచులు సిద్ధంగా ఉంచాలని డియంను ఆదేశించారు. గన్నీ సంచుల కొరత లేకుండా ఎప్పటికపుడు కొనుగోలు కేంద్రాల ఇన్చార్జి నుండి ఇండెంట్ తీసుకొని తక్షణమే గన్ని సంచులు సరఫరా చేయాలని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు రైతులు తేమ శాతం 17 ఉన్న నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని ఆయన సూచించారు.

 

ఈ టెలికాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఎస్ఓ చంద్రప్రకాశ్, పౌర సరఫరాల సంస్థ డియం ప్రసాద్, సహాకార అధికారి వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, జిసిసి జియం వాణి, మార్కెటింగ్ పర్యవేక్షకులు నరేందర్, అన్ని మండలాల వ్యవసాయ అధికారులు, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post