ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నందున రెవిన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు ముందస్తు ఏర్పాట్లతో అప్రమత్తంగా ఉండాలని,వర్షాలతో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశించారు.

పత్రికా ప్రకటన
సంగారెడ్డి, ఆగస్ట్ 30:–
ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నందున రెవిన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు ముందస్తు ఏర్పాట్లతో అప్రమత్తంగా ఉండాలని,వర్షాలతో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశించారు.

సోమవారం నాడు ఆయన గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర డీజీపీ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల వారీగా సమీక్షించారు.

ఈ సందర్భంగా సి ఎస్ మాట్లాడుతూ గత రెండు మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాల వలన ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, అధికారులందరూ తమ హెడ్క్వార్టర్స్ లోనే ఉండి పరిస్థితులను పరిశీలించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని ఆదేశించారు.

రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, వర్షాల వలన ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉండాలని, ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రమాద ప్రాంతాలకు ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసు, రెవెన్యూ యంత్రాంగం నియంత్రించాలన్నారు.

గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లాలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని శాఖల కోఆర్డినేషన్ తో పని చేస్తున్నామని, జాయింట్ టీమ్ లన్నింటిని అప్రమత్తం చేశామని, టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా శాఖల అధికారులకు తగు సూచనలు జారీ చేశామని అదనపు కలెక్టర్ రాజర్షి షా సి ఎస్ కు వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి సమస్య లేదని, మందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. అధికారులందరూ హెడ్ క్వాటర్ లో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకునేలా అప్రమత్తం చేశామని తెలిపారు.
జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరగకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నామని ఎస్పీ రమణ కుమార్ తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో నీటిపారుదల శాఖ ఎస్ ఈ, ఇ ఈ, రెవిన్యూ డివిజనల్ అధికారి తదితరులు పాల్గొన్నారు.

Share This Post