ఎత్తుగా ఎదిగే చెట్లను విద్యుత్ లైన్ల కింద నాట రాదు… జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ప్రచురణార్ధం

ఎత్తుగా ఎదిగే చెట్లను విద్యుత్ లైన్ల కింద నాట రాదు…

మహబూబాబాద్ జూలై, 15.

ఎత్తుగా ఎదిగే చెట్లను విద్యుత్ లైన్ల కింద నాట రాదని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు.

గురువారం కలెక్టర్ మున్సిపల్ పరిధిలో నర్సంపేట రోడ్డు బైపాస్ రోడ్డు లలో అవెన్యూ ప్లాంటేషన్ పనులను సంబంధిత అధికారులతో సందర్శించి పరిశీలించారు.

ముందుగా నర్సంపేట రోడ్డు లోని డి ఆర్ సి కేంద్రం వద్ద అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టేందుకు సిమెంటు రోడ్డు బ్లాస్టింగ్ పనులను రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ముఖ ద్వారాలను అందంగా తీర్చి దిద్దేందుకు అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలన్నారు రోడ్లకు ఇరువైపులా మొక్కలు తప్పనిసరిగా నాటాలి అన్నారు. విద్యుత్ వైర్ల కింద ఎత్తుగా ఎదిగి మొక్కలను నాటరాదని అధికారులకు సూచించారు.

బైపాస్ రోడ్ లో అవెన్యూ ప్లాంటేషన్ కొరకు సిమెంట్ రోడ్డు పై గుంతలు తీసే కార్యక్రమం చేపడుతున్నందున కలెక్టర్ సందర్శించి పరిశీలించారు.

అనంతరం కురవి మండల కేంద్రానికి సందర్శించి బోధవ్యాధి మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల ఇంజనీరింగ్ అధికారులు ఈఈ తానేశ్వర్, డిఈ రాజేందర్ మున్సిపల్ కమిషనర్ నరేందర్ రెడ్డి జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు కురవి ఎంపీడీవో ధన్ సింగ్, వైద్యాధికారి శ్వేత మున్సిపల్ ఏఈ బిక్షపతి వైద్య, అంగన్వాడి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post