ఎనిమిదవ విడత హరితహారానికి ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావాలి……. అదనపు కలెక్టర్ రాజర్షి షా ఎనిమిదవ విడత హరితహారానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించారు.

ఎనిమిదవ విడత హరితహారానికి ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావాలి……. అదనపు కలెక్టర్ రాజర్షి షా

ఎనిమిదవ విడత హరితహారానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించారు.

రాజర్షి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం మున్సిపల్ కమిషనర్లతో హరితహారం పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8వ విడత హరితహారానికి ఆయా మున్సిపాలిటీల లక్ష్యం మేరకు మొక్కలు నాటుటకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.

నర్సరీలలో అందుబాటులో ఉన్న మొక్కలు పరిశీలించి, లక్ష్యానికి అనుగుణంగా అవసరమైన మొక్కలను కొనుగోలు చేయడానికి ప్రణాళిక చేసుకోవాలన్నారు.

కొనుగోలు చేసే మొక్కలు పొడవైన, మంచి మొక్కలు తీసుకురావాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ కు మరింత మంచి పొడవైన మొక్కలు సిద్ధం చేసుకోవాలన్నారు.

పట్టణ ప్రగతి లో వచ్చిన నిధులలో 10 శాతం నిధులను గ్రీన్ బడ్జెట్కు
వినియోగించాలని స్పష్టం చేశారు. మే 20 నుండి జూన్ 5వ తేదీ లోగా అన్ని మున్సిపాలిటీలలో ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయాలన్నారు.

నర్సరీలను సందర్శించి కావలసిన మొక్కల స్టాక్ ఉన్నది లేనిది చూసుకోవాలన్నారు. ప్లాంటేషన్ కి స్థలాలను ముందస్తుగా గుర్తించాలని సూచించారు. ఎలాంటి గ్యాప్స్ లేకుండా చూసుకోవాలని తెలిపారు. లక్ష్యాన్ని సాధించడంలో ప్రణాళికతో బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

సమావేశంలో జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

Share This Post