ఎనిమిద‌వ విడ‌త తెలంగాణకు హ‌రిత‌హారంలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయుటకు ప్రణాళికతో సిద్దం కావాలని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ అన్నారు.

ఎనిమిద‌వ విడ‌త తెలంగాణకు హ‌రిత‌హారంలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయుటకు ప్రణాళికతో సిద్దం కావాలని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ అన్నారు.
శుక్రవారం తెలంగాణకు హరితహారం, దళితబంధు, వరి ధాన్యం కొనుగోలు, వానాకాలం పంటల సాగు ప్రణాళిక పై జిల్లాల క‌లెక్ట‌ర్లు, అధికారుల‌తో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ వీడియో కాన్ఫ‌రెన్స్ సమీక్షించారు. ఈ సందర్బంగా చీఫ్ సెక్ర‌ట‌రీ మాట్లాడుతూ 8వ విడత హరితహారం జులై కంటే ముందే ప్రారంభించి ఆగస్టు మాసం చివరికల్లా పూర్తి అయ్యే విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీ లలో ఎక్కడ స్థలం ఉంటే అక్కడ మొక్కలు నాటేవిధంగా ప్రణాళిక చేసుకోవాలన్నారు. నదీ పరివాహక ప్రాంతం, కాలువలు, కెనాల్ వెంబడి విస్తృతంగా మొక్కలు నాటేవిధంగా చూడాలన్నారు. పల్లె, పట్టణ ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు గ్రౌండింగ్ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మే, 7వ తేదీలోగా హరితహారం జిల్లా ప్రాణాళిక సిద్ధంచేసి పంపాలని ఆదేశించారు.
దళితబంధు పథకం పై సమీక్షిస్తూ నియోజకవర్గాల వారిగా మంజూరు అయిన వాటితోపాటు ప్రత్యేక మండలాలను ఎంపిక చేసిన దళితబంధు యూనిట్లు వెంటనే గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు.
వానాకాలం పంట సాగు ప్రాణాళిక పై మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలు వేసేవిధంగా రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు. పెసర్లు వేయడం వల్ల దిగుబడితో పాటు భూమి సారవంతమైతదనే విషయాన్ని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కంది పంట సాగు పెంచాలని రైతులు ఎరువులు మోతాదుకు మించి వాడకుండా అవగాహన కల్పించాలన్నారు. వరి పంట డైరెక్ట్ సీడ్స్ వేసే విధానం పై అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ విస్తీర్ణాధికారులు తమ రైతు వేదికలో ఉండి విధులు నిర్వహించేవిధంగా అదేశించి రైతువేదికలను వందశాతం ఉపయోగంలోకి తీసుకురావాలని కలెక్టర్లను సూచించారు.
వరి కొనుగోలు పై సమీక్ష నిర్వహిస్తూ వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిచాలని వచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు వివరాలు అదేరోజు ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. కలెక్టర్లు కొనుగోలు కేంద్రాలను సందర్శించి సమస్యలు లేకుండా చూడాలన్నారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్ మాట్లాడుతూ ఎనిమిద‌వ విడ‌త తెలంగాణకు హ‌రిత‌హారంలో రంగారెడ్డి జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయుటకు ప్రణాళిక సిద్దం చేసుకొని లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వరిని కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. వ్యవసాయ అధికారులు రైతు వేదికలలోనే అన్నీ సమావేశాలను నిర్వహించేలా చర్యలు చేపడతామని, వానాకాలం కార్యచరణ ప్రణాళికను రూపొందించుకొని పని చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. దళిత బంధు మొదటి విడతలో జిల్లాలో 697 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 50 మంది లబ్దిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ల మంజూరీ పత్రాలను, ట్రాన్స్ పోర్ట్ వాహనాలను పంపిణీ చేశామనీ, మిగిలిన వారికి ఎంచుకున్న యూనిట్లను పంపిణీ చేస్తామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫెరెన్సులో అడిషనల్ కలెక్టర్లు తిరుపతి రావు, ప్రతీక్ జైన్, జిల్లా వ్యవసాయ అధికారి గీత రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్యామలక్ష్మి, జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ దీలిప్ కుమార్, మున్సిపల్ కమిషనరులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Share This Post