ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆరోగ్యవంతమైన ఓటర్ జాబితాను సిద్ధం చేయండి-జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సెప్టెంబర్ 21, 2021ఆదిలాబాదు:-

ఆరోగ్యవంతమైన ఓటర్ జాబితా సిద్ధం చేయడానికి బూత్ స్థాయి అధికారులు ఎన్నికల కమిషన్ నియమావళిని పాటించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో బూత్ స్థాయి అధికారులకు, సూపర్ వైజర్ లకు 2022 ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం, బూత్ స్థాయి అధికారుల రిజిస్టర్ ల నవీకరణ, ఆరోగ్యవంతమైన ఓటర్ జాబితా సిద్ధం చేయడం, గరుడ యాప్ డౌన్ లోడ్, నిర్వహణ వంటి అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఆరోగ్యవంతమైన ఓటర్ జాబితాను తయారు చేయాలనీ, ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఎన్నికల కమిషన్ నియమావళిని అనుసరించి నిర్వహించాలని అన్నారు. ఫారం-6, 6A, 7, 8, 8A లు అందినవాటిని పరిశీలించి చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రత్యేక ఓటర్ నమోదు 2022 ప్రకారం ఓటర్ జాబితాను తయారుచేయాల్సి ఉంటుందని అన్నారు. ప్రతి బూత్ స్థాయి అధికారి గరుడ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని వాటిని సమర్దవంతంగా వినియోగించాలని అన్నారు. అంతకు ముందు ప్రత్యేక ఓటర్ నమోదు 2022, రిజిస్టర్ ల నిర్వహణ, ఆరోగ్య వంతమైన ఓటర్ జాబితా సిద్ధం చేయడం వంటి అంశాలపై మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ బూత్ స్థాయి అధికారులు వివరించారు. అనంతరం గరుడ యాప్ వినియోగం పై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ పట్టణ తహసీల్దార్ భోజన్న, ఎన్నికల విభాగం నాయబ్ తహసీల్దార్ మహేష్, బూత్ స్థాయి అధికారులు, సూపర్ వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post