ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాల మార్పులను ప్రతిపాదించాలి- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్.

భారత ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాల మార్పులను ప్రతిపాదించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పోలింగ్ కేంద్రాల మార్పు, తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ నియమనిబంధనల మేరకు ప్రభుత్వ భవనాలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలనీ, ఇప్పటివరకు ప్రభుత్వేతర భవనాలలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలను సమీప ప్రభుత్వ భవనాలలోకి మార్చుటకు ప్రతిపాదనలు ఎన్నికల కమిషన్ కు సమర్పించుటకు రాజకీయ పార్టీల ఆమోదం కోసం సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆదిలాబాద్ నియోజకవర్గం లోని ఐదు పోలింగ్ కేంద్రాలను ప్రభుత్వ భావనాలలోకి మార్చడానికి ప్రతిపాదించడం జరిగిందని, రాజకీయ పార్టీలు ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా ఇతర పోలింగ్ కేంద్రాలలో ఏమైనా మార్పులు చేయడానికి ప్రతిపాదించవచ్చని, అట్టి వాటిని రిటర్నింగ్ అధికారులు పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో వెంటిలేషన్, త్రాగునీరు, గేట్, ర్యాంప్, తదితర సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్ ల జాబితాను అందజేయాలని కోరారు. ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం లో భాగంగా జనవరి 1, 2022 నాటికీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని, అందుకు నిర్ణిత ఫారం-6 ద్వారా గాని, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా నిర్ణిత డాక్యుమెంట్ లను సమర్పిస్తూ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకునే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు వారి పరిధిలోని ప్రజలకు తెలియపరచాలని అన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఆర్డీఓ రాజేశ్వర్, అర్బన్ తహసీల్దార్ భోజన్న, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు నలంద ప్రియా, ఎన్నికల విభాగం నాయబ్ తహసీల్దార్లు మహేష్, శ్రీవాణి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post