ఎన్నికల కోడ్ పకడ్బంధీగా అమలుకు అదనంగా బృందాల ఏర్పాటు : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

ఎన్నికల కోడ్ పకడ్బంధీగా అమలుకు అదనంగా బృందాల ఏర్పాటు

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
-000-

హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బంధీగా అమలు చేయుటకు అదనంగా 5 ఫ్లయింగ్ స్క్వాడ్ టీం లు, 5 స్టాటిక్ సర్వలెన్స్ టీంలు, 1 వీడియో సర్వలెన్స్ టీం, 1 వీడియో వ్యూయింగ్ టీం, 1 సహాయ వ్యయ పరిశీలకుల టీం, 1 అకౌంటింగ్ టీంలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టీం లు హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో వివిధ రాజకీయ పార్టీల సభలు, సమవేశాలు, రోడ్ షోలను, ప్రచార సరళిని నిశితంగా పరిశీలిస్తూ, అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను లెక్కిస్తారని తెలిపారు.

Share This Post