ఎన్నికల చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్

హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా వరంగల్, హుజురాబాద్ మధ్యలో స్టాటిక్ సర్వలెన్స్ టీంతో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తనిఖీ చేశారు. శుక్రవారం వరంగల్ నుండి హుజురాబాద్ వచ్చే ప్రధాన రోడ్డులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను ఎక్స్ పెండిచర్ అబ్జర్వర్ జి. ఎలమురుగుతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సంధర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ద్వారా వచ్చు ప్రతి వాహనాన్ని చెక్ పోస్టు వద్ద తనిఖీ చేయాలని స్టాటిక్ సర్వలెన్స్ టీంను కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా అక్రమంగా డబ్బులు, మద్యం రవాణా చేసే అవకాశం ఉందని, సర్వలెన్స్ టీం 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ వాహనాలను తనిఖీ చేయాలని ఆదేశించారు.

Share This Post