ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

హుజురాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ శుక్రవారం పరిశీలించారు. శుక్రవారం హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గం సంబంధించి హుజురాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ స్వీకరణ ప్రక్రియను ఎన్నికల వ్యయ పరిశీలకులు జి. ఎలమురుగుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని, తూచా తప్పకుండా అమలు చేయాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించారు.

          ఈ కార్యక్రమంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు జి. ఎలమురుగు, హుజురాబాద్ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిందర్ రెడ్డి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post