ఎన్నికల నిర్వహణపై నోడల్, సెక్టోరల్ అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

పత్రికా ప్రకటన
 తేదీ: 29-09-2021
కరీంనగర్

హుజురాబాద్ ఎన్నికల నిర్వహణకు పకడ్బంధీ ఏర్పాట్లు చేయాలి:

ఎన్నికల కోడ్ ను కఠినంగా అమలు పర్చాలి:

పోలింగ్ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించాలి:

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

0000
హుజురాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం  ఉప ఎన్నికల నిర్వాహణకు పకడ్బంది ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల నోడల్ అధికారులు, సెక్టోరల్ ఆఫిసర్లతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు విస్తృతంగా చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థల గోడలపై ఎలాంటి వాల్ రైటింగ్స్ ఉండకూడదని ఆదేశించారు. అనుమతి లేని ప్రచార హోర్డింగ్లను తొలగించాలని అన్నారు. రోడ్ల వెంబడి విద్యుత్ స్తంభాలపై ఎలాంటి ప్రచార ఫ్లెక్సీలు ఉండకూడదని సూచించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా రోడ్ షోలు, సైకిల్, బైకు ర్యాలీలు, పాదయాత్రలకు అనుమతి లేదని అన్నారు. స్టార్ క్యాంపెయిన్ ల సమావేశానికి వెయ్యి మందికి, ఇతర సమావేశాలకు 500 మందికి మాత్రమే అనుమతించాలని అన్నారు. ఇంటింటి ప్రచారంలో 5 గురు మాత్రమే పాల్గొనాలని అన్నారు. సెక్టోరల్ ఆఫిసర్లు తమ పోలింగ్ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బంధీగా అమలు చేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సమాచారం వస్తే వెంటనే స్పందించి వెళ్లాలని ఆదేశించారు. సెక్టోరల్ ఆఫీసర్లు తమ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో ర్యాంపులు, లైటింగ్, వాష్ రూంలు, విద్యుత్ సౌకర్యం ఉన్నవి లేనివి తనిఖీ చేయాలని, లేనిచో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వర్షాకాలం అయినందున పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు వర్షానికి తడువకుండా షెడ్లు వేయించాలని సూచించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు.

*కలెక్టరేట్ లో ప్రత్యేక వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు:
*
ఎన్నికల విధులలో పాల్గొను సిబ్బంది అందరూ రెండు డోసుల కోవిడ్ టీకా తీసుకొని ఉండాలని, తీసుకోని వారి కొరకు కలెక్టరేట్ లో ప్రత్యేక వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల సిబ్బందితో పాటు వాహనాల డ్రైవర్లు, అటెండర్లు కూడా రెండు డోసు వ్యాక్సిన్లు తీసుకొని ఉండాలని అన్నారు.

*పోలింగ్ సిబ్బంది అందరికి శిక్షణ తరగతులు:
*
హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ లో పాల్గొను ప్రెసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రెసైడింగ్ ఆఫీసర్, ఇతర పోలింగ్ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. అక్టోబర్ 4న మొదటి విడుత శిక్షణ తరగతులు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ తో పాటు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. రెండవ విడుత ట్రైనింగ్ అక్టోబర్ 18,తేదిన నిర్వహించాలని అన్నారు. ప్రతి శిక్షణ కార్యక్రమంలో ఈ.వి.యం. మిషన్లు ఉండాలని, ఈ.వి.యం మిషన్ల వినియోగంపై కూడా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలలోని గ్రామాలలో ఈ.వి.యం మిషన్లపై  ఓటు వేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. 5 మండలాలు, 2 మున్సిపాలిటీలలో 7 టీంలను ఏర్పాటు చేసి అక్టోబర్ 5 నుండి 20 లోగా గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గ్రామాలలో ఈ.వి.యంలపై ప్రభుత్వ స్థలాలలో మాత్రమే పబ్లిక్ ప్లేస్ లలో  అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల రిసిప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో కోవిడ్ నిబంధనలను పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల సిబ్బంది రవాణాకు ఆర్టీసి బస్సులను సమకూర్చాలని డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ను కలెక్టర్ ఆదేశించారు. సెక్టోరల్ ఆఫీసర్లందరికి వాహనాలు సమకూర్చాలని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంకు సంబంధించి ఎన్నికల ప్రొఫైల్ తయారు చేయాలని ముఖ్య ప్రణాళిక అధికారిని ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్, గరీమా అగర్వాల్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ప్రియాంక, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా అధికారులు, నోడల్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post