ఎన్నికల నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్లు శ్యామ్ ప్రసాద్ లాల్, లోకల్ బాడీస్ గరిమ అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్.

ఎన్నికల ప్రచారం ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 7.00 గంటల వరకే

ఎం.సి.సి. నిబంధనలు అతిక్రమించే వారి పై కఠిన చర్యలు

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్
ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశం

పోలింగ్ ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 7.00 గంటల వరకు

కోవిడ్ నిబంధనలను తప్పని సరిగా పాటించాలి:

0000
హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 7.00 గంటల వరకే ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాలని, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి అక్టోబర్ 30 న పోలింగ్ ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 7.00 గంటల వరకు ఉంటుందని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, పోలింగ్ కేంద్రాల్లోని సిబ్బంది మాస్కులు, ఫేస్ షీల్డ్, గ్లౌసులు ధరించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లు భౌతిక దూరం పాటించేలా చూడాలని, తప్పని సరిగా మాస్కులు ధరించాలని, ఓటు వేసే కుడి చేతికి చేతి తొడుగు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఏ.ఎన్.ఎం., హెల్త్ వర్కర్ ను నియమించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో మాస్కులు, సానిటైజర్లు, చేతి తొడుగులు, థర్మల్ స్కానర్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 7.00 గంటల వరకే ఎన్నికల ప్రచారం నిర్వహించాలని, సాయంత్రం 7.00 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం నిర్వహించే వారిపై ఎం.సి.సి. నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్పష్టం చేశారు. సాయంత్రం 7.00 గంటల తర్వాత దూందాం లు, డ్యాన్సులు నిర్వహించరాదని, ఎన్నికల ప్రచారంలో ర్యాలీలు, బైక్ ర్యాలీ నిర్వహించకూడదని తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం కఠిన చర్యలు అమలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కు 72 గంటల ముందే ఎన్నికల ప్రచారం ముగుస్తుందని తెలిపారు. ఎన్నికల సిబ్బందికి నిర్వహించే శిక్షణా కార్యక్రమాలను బ్యాచ్ ల వారీగా నిర్వహించాలని సిబ్బంది భౌతిక దూరం పాటించేలా చూడాలని, మాస్కులు ధరించి శిక్షణకు వచ్చేలా చూడాలని కలెక్టర్ నోడల్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద మున్సిపాలిటీలు గ్రామ పంచాయితీల ఆధ్వర్యంలో సానిటైజేషన్ చేయించాలని తెలిపారు. పోలింగ్ సిబ్బంది తప్పని సరిగా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ చేయించుకొవాలని అన్నారు. రెండు డోసుల వ్యాక్సినేషన్ చేయించుకున్న పోలీస్ సిబ్బందిని ఎన్నికల విధుల్లో ఎన్నికల విధుల్లో నియమించాలని అడిషనల్ డి.సి.పి. కి సూచించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ఇన్ డోర్ అయితే 200 మందితో, స్టార్ క్యాంపెయినర్లతొ నిర్వహించే బహిరంగ సమావేశాలకు 1,000 మందితో, సాధారణ సమావేశాలకు 500 మందికి మించకూడదని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో బెల్ట్ షాపులను  ఎక్సైజ్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు. ఎన్నికల సామాగ్రితో వెళ్లే పోలింగ్ సిబ్బందికి ఫిట్ నెస్ తో ఉన్న వాహనాలు సమకూర్చాలని ఉప రవాణా శాఖాధికారిని ఆదేశించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేవల్ టీమ్, వీడియో సర్వేలెన్స్ టీమ్, వీడియో వ్యూయింగ్ టీముల పని తీరును జి.పి.ఎస్. ద్వారా మానిటరింగ్ చేయాలని తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు జి.వి. శ్యాం ప్రసాద్ లాల్, గరీమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జడ్పీ సి.ఈ.వో. ప్రియాంక, నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post