ఎన్నికల పటిష్ట నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకారం అందించాలి. జిల్లాలో మూడు పొలింగ్ కేంద్రాలు ఏర్పాటు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు.:అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు

జిల్లాలో వచ్చే నెల 10 న జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేయనున్నట్లు అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు అన్నారు. గురువారం కలెక్టరేట్ నందు ఎన్నికల నిర్వహణ లో భాగంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న 12 స్థానిక సంస్థల ఎం.యల్.సి స్థానాలకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందని, ఈ నెల 16న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఆయన తెలిపారు. నవంబర్ 16 నుండి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న నామినేషన్ల పరిశీలన , 26లోపు నామినేషన్ల ఉపసవరణ గడువు ముగుస్తుందని అలాగే డిసెంబర్ 10న పోలింగ్, డిసెంబర్ 14న కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందని వివరించారు.  జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని సూర్యాపేట నందు ఎంపీడీఓ కార్యాలయం నందు స్త్రీ శక్తి భవన్, కోదాడలో జెడ్.పి. హెచ్.యస్ బాలుర పాఠశాల అలాగే హుజూర్ నగర్ నందు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లాలో మొత్తం ఓటర్లు 402 మంది ఉన్నారని ఈ సందర్బంగా పేర్కొన్నారు. జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు ఈ. సి.ఐ నిబంధనలను తప్పక పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పూర్తి సహకారం అందించాలని కోరారు. అనంతరం అన్ని పార్టీల ప్రతినిధులు వారి అభిప్రాయాలను తెలియజేసి జిల్లాలో ఎన్నికల నిర్వహణలో పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.
   ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నుండి చకిలం రాజేశ్వర రావు, టి.ఆర్.యస్. నుండి యస్. సత్యనారాయణ, సీపీఎం నుండి కోటా గోపి, సీపీఐ నుండి యం. లక్ష్మయ్య, బి.యస్.పి. నుండి స్టాలిన్, ప్రజావాణి పార్టీ నుండి లింగిడి వెంకటేశ్వర్లు , ఎన్నికల పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, డి.టి. కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post