ఎన్నికల పరిశీలకులు అనితా రాజేంద్ర సమక్షంలో బుధవారం నాడు రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్లను పరిశీలించారు.

ఎన్నికల పరిశీలకులు అనితా రాజేంద్ర సమక్షంలో బుధవారం నాడు రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్లను పరిశీలించారు.

నామినేషన్ ల చివరి రోజైన మంగళవారం నాటికి ఇద్దరు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు సమర్పించారు.

1) టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత నామినేషన్ పత్రాలు సరిగా ఉన్నట్లు ధృవీకరించారు.

2) స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ నామినేషన్ లో ఫారం 26 లో అఫిడవిట్ లో తప్పులు ఉన్నందున తిరస్కరించారు.

అంతకుముందు నామినేషన్ల పరిశీలనకు వచ్చిన ఎన్నికల పరిశీలకులు అనితా రాజేంద్ర కు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రా మిశ్రా, పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం తెలిపారు.

అభ్యర్థుల తరఫున వారి ప్రతినిధులు నామినేషన్ల పరిశీలన లో పాల్గొన్నారు.

Share This Post