ఎన్నికల పరిశీలకుల సమావేశం లో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్

 

ఎన్నికల ప్రవర్తనా నియమావళి పకడ్బందీగా అమలు

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్

నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం

పాల్గొన్న కేంద్ర ఎన్నికల పరిశీలకులు

000000

హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు ముత్తు కృష్ణన్ శంకర్ నారాయణ, పోలీస్ పరిశీలకులు అనుపమ్ అగర్వాల్, వ్యయ పరిశీలకులు ఎస్ హెచ్. ఎల మురుగు, ఎస్ హెచ్. సుబోద్ సింగ్, పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణలతో కలసి నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులు, ఇండి పెండెంట్ అభ్యర్థులు పత్రికలు, చానల్సు లలో ఇచ్చే ప్రకటనలు, యూట్యూబ్ చానల్స్ ప్రకటనలు, సోషల్ మీడియా ప్రకటనలపై, పెయిడ్ న్యూస్ వార్తలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ తప్పుడు వార్తలపై ఎప్పటికప్పుడు నివేదిక అందజేస్తుందని అన్నారు. ఎన్నికలలో మద్యం, నగదు పంపిణీ చేస్తే కేసు బుక్ చేస్తామని తెలిపారు. బ్యాంకు ఖాతాల ద్వారా రూపాయలు లక్ష దాటే రో జు వారి లావాదేవీలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ ను ఆదేశించారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో బెల్ట్ షాపులను మూసి వేయించాలని ఎక్సైజ్ సూపరిండెంట్ ను ఆదేశించారు. హుజరాబాద్ నియోజకవర్గంలోకి వచ్చే రహదారులపై ఏర్పాటు చేసిన చెక్ పోస్టులతో పాటు గట్టి నిఘా పెట్టాలని పోలీస్ కమిషనర్ కు సూచించారు. అనంతరము కేంద్ర ఎన్నికల పరిశీలకులు హుజూరాబాద్ నియోజకవర్గం లో చేపడుతున్న బందోబస్తు, చెక్ పోస్టులు, పోటీలో ఉన్న అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చు ల వివరాలపై సంబంధిత నోడల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, నోడల్ అధికారులు మహమ్మద్ అబ్దుల్ కలీం, చంద్రశేఖర్, ఆడిట్ శాఖ డిడి రాము, ఎల్ డి ఎం లక్ష్మణ్, ఎం సీ ఎం సీ కమిటీ సభ్యులు శివరాం,బి. విజయ సింహా రావు, సంపత్, తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post