ఎన్నికల పోలింగ్ స్టేషన్లు పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ , జిల్లా ఎన్నికల అధికారి ,కలెక్టర్ ఆర్ .వి కర్ణన్ ,పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ తదితరులు

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
00000

హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలోనీ పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ పరిశీలించారు. ఆదివారం హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట, మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తో కలిసి పరిశీలించారు. ఈ పాఠశాలలోని 163,164,170,171 నెంబరు గల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఒకే వరసలో ఉన్న పోలింగ్ కేంద్రాల లో లఓటర్లు రద్దీ లేకుండా, కోవిడ్ నిబంధనల మేరకు వారిని వరుసక్రమంలో ఓటు వినియోగించుకునెందుకు పంపించాలని అధికారులకు సూచించారు. ఓటర్లు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చూడాలని, చేతులు సానిటైజ్ చేసుకోవాలని, భౌతిక దూరం పాటించేలా చూడాలని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక ఏఎన్ఎం, ఒక ఆశ వర్కర్ ను నియమించాలని అన్నారు. అనంతరం ఈ నెల 30న జరగనున్న ఉప ఎన్నిక సందర్భంగా హుజరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించారు. స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులకు సూచించారు. అనంతరం ఎన్నికల అధికారులు పోలీస్ అధికారులతో సమావేశమై ఎన్నికల సరళి ,నిర్వహణపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్, పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి సిహెచ్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post