ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 340 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కామారెడ్డి లో 147, బాన్సువాడ లో 130, ఎల్లారెడ్డిలో 63 మంది చొప్పున ఓటర్లు ఉన్నారని చెప్పారు. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల సమయంలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి రాజకీయ పార్టీల నాయకులు ముందస్తుగా ఆర్డీవో, పోలీస్ శాఖ నుంచి అనుమతులు పొందాలని పేర్కొన్నారు. ఈ నెల 23న నామినేషన్ల స్వీకరణ,26 న విత్ డ్రా, డిసెంబర్ 10న ఉదయం 8 గంటల నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. అంతకు ముందు రాజకీయ పార్టీల నాయకులతో ఎన్నికల నియమాలను పాటించాలని అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా సభలు ,సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, ఎన్నికల సూపరిండెంట్ భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు. Dpro..Kamareddy

Share This Post