DPRO ADB -ఎన్నికల ప్రవర్తన నియమావళి ననుసరించి స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికలను నిర్వహించాలి- ఎన్నికల ప్రధాన అధికారి డా.శశాంక్ గోయల్.

స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికలను ప్రశాంతంగా, ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించి నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ అన్నారు. బుధవారం రోజున హైదరాబాద్ నుండి జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో శాసన మండలి ఎన్నికల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, శాసన మండలి ఎన్నికలకు సంబందించిన సమాచారాన్ని కలెక్టర్లకు పంపించడం జరిగిందని, ఈ నెల 16 న నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుందని, నవంబర్ 16 నుండి 23 నుండి నామినేషన్ ల స్వీకరణ, 24 న నామినేషన్ ల పరిశీలన, నవంబర్ 26 వరకు నామినేషన్ ల ఉప సంహరణ గడువు ఉంటుందని, డిశంబర్ 10 న పోలింగ్, 14 న లెక్కింపు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఎన్నికల నిర్వహణ కు ఆయా జిల్లాల కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులుగా, అదనపు కలెక్టర్లు సహాయ రిటర్నింగ్ అధికారులు వ్యవహరిస్తారని తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా, సమన్వయంతో, పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు. MLC ఎన్నికల నేపథ్యంలో ఆయా జిల్లాల పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికలలో ఎంపీటీసీ లు, జడ్పీటీసీ లు, కౌన్సిలర్ లు ఓటర్లుగా ఉంటారని తెలిపారు. పోలింగ్ కు అనువైన కేంద్రాలను గుర్తించాలని ఆయన సూచించారు. జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల ఏర్పాట్లపై వివరించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, కరోనా మార్గదర్శకాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రవర్తన నియమావళిని పాటిస్తూ రాజకీయ పార్టీలు, అభ్యర్థులను ప్రచారాలు నిర్వహించుకునే విధంగా ముందస్తు అనుమతులు నిబంధనల మేరకు జారీ చేయాలనీ సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, ఆర్డీఓ రాజేశ్వర్, జిల్లా పరిషత్ సీఈఓ గణపతి, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా, తదితరులు పాల్గొన్నారు.

Share This Post