ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు- జిల్లా ఎన్నికల అధికారి హరీష్

స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన సంగారెడ్డి పట్టణంలోని కల్వకుంట కు చెందిన బోయిని విజయలక్ష్మి శుక్రవారం నాడు తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి హరీష్ కు నామినేషన్ల ఉపసంహరణ పత్రాన్ని అందజేశారు. 04-మెదక్ స్థానిక సంస్థల నియోజక వర్గం నుండి తెలంగాణ శాసన మండలి సభ్యుని ఎన్నికకు ఏడుగురు అభ్యర్థులు 13 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, పరిశీలనలో రెండు తిరస్కరింపబడగా, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం టి.ఆర్.ఎస్. అభ్యర్థిగా ఒంటెరి యాదవ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థినిగా టి.నిర్మల, స్వతంత్ర అభ్యర్థిగా మట్ట మల్లా రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు

Share This Post