ఎన్నికల శిక్షణ తరగతులను పరిశీలించి మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పాల్గొన్న ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్

పోలింగ్ సిబ్బంది విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్

ఎస్ఆర్ఆర్ కళాశాలలో పి ఓ లు, ఏపివోలకు శిక్షణ
00000

ఈ నెల 30న జరుగనున్న హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా ప్రిసీడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

గురువారం స్థానిక ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలలో వినియోగించే ఈవీఎం యంత్రాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి తదితర అంశాలకు సంబంధించి అందజేసిన కరదీపిక పుస్తకాలను క్షుణ్ణంగా చదువుకోవాలని వారికి సూచించారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతోందని తెలిపారు. పోలింగ్ రోజు ఉదయం ఆరు గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించాలని అన్నారు. మాక్ పోలింగ్ లో తప్పనిసరిగా 50 ఓట్లు పోలయ్యేలా చూడాలన్నారు. మాక్ పోలింగ్ తర్వాత వివి ప్యాట్ ల లోని స్లిప్స్ లను తీసివేసి సీల్ చేసుకోవాలని తెలిపారు. హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఈవీఎం యంత్రాలు తీసుకొని పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేముందు యంత్రాలను తనిఖీ చేసుకోవాలని అన్నారు. పోలింగ్ రోజున వీవీప్యాట్ లలో ఏమైనా సమస్యలు ఉంటే సెక్టోరల్ అధికారులకు ఫోన్ చేసి కొత్తవి తెప్పించుకోవాలని అన్నారు. ఎన్నికల సిబ్బంది తప్పనిసరిగా రెండు డోసులు వ్యాక్సినేషన్ తీసుకోవాలని అన్నారు. కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. మాస్కులు ధరించడంతో పాటు, చేతులు సానిటైజ్ చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. పిఓ డైరీ తప్పనిసరిగా రాయాలని సూచించారు. ఎన్నిక ముగిశాక ఈవీఎం యంత్రాలు, ఎన్నికల సామాగ్రిని భద్రంగా కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్ కళాశాలలోని రిసెప్షన్ సెంటర్ లో అప్పగించాలని తెలిపారు. ఎన్నికల సిబ్బందికి రిసెప్షన్ సెంటర్ లో భోజన సౌకర్యం కల్పిస్తామని అన్నారు. పివో లు, ఏ పీ ఓ లు సమన్వయంతో పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ తెలిపారు. అనంతరము ఎన్నికల సిబ్బందికి మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల విధులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పై శిక్షణ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post