ఎన్నికల శిక్షణ తరగతులను పరిశీలించి మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పాల్గొన్న ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్.

పోలింగ్ సిబ్బంది తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సినేషన్
వేసుకోవాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్

ఎన్నికల శిక్షణా తరగతుల పరిశీలన

శిక్షణకు గైర్హాజరైన 62 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు

000000

హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక విధులలో పాల్గొనే పోలింగ్ సిబ్బంది తప్పనిసరిగా కోవిడ్ రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకొని ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు.

గురువారం మధ్యాహ్నం స్థానిక ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు నిర్వహించిన ఎన్నికల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ముందుగా కళాశాలలో ఏర్పాటుచేసిన కోవిడ్-19 ప్రత్యేక వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించి వైద్య సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు. అనంతరము ఎన్నికల శిక్షణ తరగతులను పరిశీలించి, ఎన్నికల విధులు నిర్వహించనున్న సిబ్బందికి పోలింగ్ రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకొని సిబ్బంది కళాశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ సెంటర్లో వ్యాక్సినేషన్ వేయించుకోవాలని అన్నారు. ఉదయము, మధ్యాహ్నము బ్యాచ్ ల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికల విధులకు ఎంపికై శిక్షణకు గైర్హాజరైన 62 మంది పోలింగ్ సిబ్బందికి కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, ట్రైనింగ్ సెంటర్ ఇన్ ఛార్జ్ బి.రవీందర్, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post