ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయంలో గల EVM Godownను పరిశీలించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన తేది:13.8.2021
వనపర్తి.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గల EVM GODOWN ను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష పరిశీలించారు.
శుక్రవారం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గల EVM GODOWN లో ఉన్న CU,BU,VVPAT Conflict resolve చేయుటకు Phy sical Verification చేశారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ EVM గోడౌన్ ను తెరిచి Physical Verification చేసి, వెంటనే రాజకీయ పార్టీల ప్రతినిధుల ఎదుట సీల్ చేయడమైనది.
ఒక బ్యాలెట్ యూనిట్ బీహారులో, అదేవిధంగా వనపర్తి EVM WAREHOUSE లో ఓకే నెంబర్ తో ఉన్నదని ఎన్నికల సంఘం నుంచి ఆదేశాల రాగా, ఒకసారి అట్టి ballot unit Godown ను అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరిచి పరిశీలించి ఎన్నికల సంఘానికి నివేదిక అందచేసినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.
జిల్లా కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, కలెక్టరేట్ తాసిల్దార్ రమేష్ రెడ్డి, ఎమ్మార్వో రాజేందర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, ఐ ఎన్ సి జిల్లా అధ్యక్షుడు పి శంకర్ ప్రసాద్, బిజెపి పార్టీ రామ్మోహన్, వైయస్సార్ పార్టీ ఎస్ రాజశేఖర్, టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాశ, టిడిపి రాష్ట్రస్థాయి స్పోక్ సభ్యులు సయ్యద్ జమీల్ ఉల్లా, బి ఎస్ పి పార్టీ వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి, ఆయా పార్టీల ప్రతినిధులు కలెక్టర్ వెంట ఉన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post