ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నియమ నిబంధనలను సమగ్రంగా అవగాహన చేసుకొని పూర్తి సంసిద్ధతతో పోలింగ్ విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.పి. గౌతమ్ అధికారులకు సూచించారు.

ప్రచురణార్ధం

నవంబరు 30, ఖమ్మం –

ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నియమ నిబంధనలను సమగ్రంగా అవగాహన చేసుకొని పూర్తి సంసిద్ధతతో పోలింగ్ విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.పి. గౌతమ్ అధికారులకు సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి ఎన్నికలను పురస్కరించుకొని డిశంబరు 10 వ తేదీన జరుగనున్న పోలింగ్ నిర్వహణకు గాను నియమించబడిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, పోలింగ్ సిబ్బందికి నగరంలోని డి.పి.ఆర్.సి భవనంలో మంగళవారం నిర్వహించిన మొదటి విడత శిక్షణా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై పలు సూచనలు, ఆదేశాలు చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధులు ఎన్నిమార్లు నిర్వర్తించినప్పటికీ ప్రతి ఎన్నిక కొత్త అనుభవాన్ని ఇస్తుందని, పోలింగ్ విధులను పూర్తి అప్రమత్తతతో నిర్వర్తించాలని చిన్నపాటి పొరపాటు జరిగిన రీ -పోలింగ్  కు అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. పరిపాలన విషయాలలో తప్పులు జరిగితే సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని, కాని ఎన్నికల విధులలో తప్పు జరిగితే సరిచేసుకోలేమని, ఎన్నికల సంఘం పరిధిలో జరిగే ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకనుగుణంగా నిర్వహించాలని, ఎన్నికల ప్రక్రియలో పోలింగి విధులు చాలా కీలకమైనవని, ఇట్టి పోలింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు శిక్షణ చాల ముఖ్యమని కలెక్టర్ అన్నారు. పోలింగ్ కేంద్రంలో అధికారులు, సిబ్బంది విధులపట్ల సమగ్ర అవగాహన కలిగి ఉండా లని, శిక్షణ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. బ్యాలెట్ బాక్సు సీల్ చేయడం, పేపర్ సీల్ వేయడం, పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారులు, సిబ్బందితో పాటు అనుమతించే వ్యక్తులు, బ్యాలెట్ పేపర్ సీక్రసీ, పోలింగ్ కు సంబంధించిన ఫారమ్స్ పూర్తి చేయడం తదితర విషయాలను పోలింగ్ అధికారులు, సిబ్బందితో కలెక్టర్ ఆచరణాత్మకంగా చేయించారు. దిశంబరు 6 న రెండవ విడత శిక్షణ తరగతులుంటాయని ఇట్టి శిక్షణ ద్వారా పోలింగ్ విధులకు పూర్తి సంసిద్ధతతో ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

మాస్టర్ ట్రైనర్ శైలేంద్ర, నాగిరెడ్డి, నోడల్ అధికారి శ్రీరామ్, పోలింగ్ అధికారులకు, సిబ్బందికి శిక్షణ తరగతులను నిర్వహించారు.

అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, సెక్టోరల్, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది, ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post