ప్రచురణార్ధం
డిశంబరు, 07, , ఖమ్మం: –
ఎన్నికల సంఘం మార్గదర్శకాలకనుగుణంగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా సూక్ష్మ పరిశీలన చేయాలని’ ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సాధారణ పరిశీలకులు సి. సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం డి.పి.ఆర్.సి భవనంలో సూక్ష్మ పరిశీలకులు (మైక్రో అబ్బర్వర్స్) కు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఎన్నికల అబ్జర్వర్ సి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైక్రో అబ్జర్వర్స్ కు వారు పలు సూచనలు చేసారు. సాధారణ పరిశీలకులు సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని సూక్ష్మస్థాయిలో పరిశీలన చేయాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాల ఉల్లంఘన, ఇతర ఎటువంటి సంఘటన దృష్టికి వచ్చిన యెడల వెంటనే ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారి, సెక్టోరల్ అధికారులకు సమాచారాన్ని అందించాలని ఆయన సూచించారు. సీక్రసీ ఆఫ్ ఓటింగ్ను పాటించాలని పోలింగ్ కంపార్ట్ మెంట్ లో వీడియో, ఫోటోగ్రఫీకు అనుమతి లేదని, అదేవిధంగా పోలింగ్ ఏజెంట్లు కూడా ఒక్క అభ్యర్థికి ఒక్క ఏజెంట్ను మాత్రమే అనుమతించబడుతుందని, పోలింగ్కు సంబంధించి సూక్ష్మ పరిశీలకుల విధులను క్షుణ్ణంగా అవగాహన పర్చుకొని తమ విధులను బాధ్యతా యుతంగా నిర్వర్తించాలని ఎన్నికల అబ్జర్వర్ సి. సుదర్శన్ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.పి. గౌతమ్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, పోలింగ్ అధికారులు, సిబ్బందికి రెండు విడతల శిక్షణ తరగతుల ద్వారా సంసిద్ధం చేసామన్నారు. అదేవిధంగా సెక్టోరల్ అధికారులు, పోలీసు అధికారుల బృంధం పోలింగ్ ప్రక్రియకు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని, ఎన్నికల సంఘం సూచించిన విధంగా సూక్ష్మపరిశీలకులు పోలింగ్ ప్రక్రియను పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని, ఏదైనా అవాంఛనీయ సంఘటన చోటు చేసుకున్న యెడల సత్వరమే అట్టి సమాచారాన్ని సెక్టోరల్ అధికారులకు కాని రిటర్నింగ్ అధికారికి, లేదా ఎన్నికల పరిశీలకులకు సత్వరమే సమాచారం: అందించాలని కలెక్టర్ సూచించారు. డి.పి.ఆర్.సి భవనంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ , రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ను ఎన్నికల సాధారణ పరిశీలకులు సి. సుదర్శన్ రెడ్డికి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ వివరించారు. సి.సి.టి.వి. ద్వారా చేపట్టిన రక్షణ చర్యలను పరిశీలించి పలు సూచనలు చేసారు.
అదనపు కలెక్టర్, సహాయ రిటర్నింగ్ అధికారి ఎస్.మధుసూదన్, శిక్షణ నోడల్ అధికారి శ్రీరామ్, మైక్రో అబ్జర్వర్స్ నోడల్ అధికారి చంద్రశేఖర్, ఖమ్మం, కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, సర్వేల్యాండ్ రికార్డ్స్ ఏ.డి రాము, ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్ రాంబాబు, మైక్రో అబ్జర్వర్లు తదితరులు పాల్గొన్నారు.