ఎన్నికల సంఘం మార్గదర్శకాలకనుగుణంగా కౌంటింగ్ ప్రక్రియను సమగ్ర అవగాహనతో సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.పి. గౌతమ్ అన్నారు.

ప్రచురణార్ధం |

డిశంబరు, 13, ఖమ్మం:

ఎన్నికల సంఘం మార్గదర్శకాలకనుగుణంగా కౌంటింగ్ ప్రక్రియను సమగ్ర అవగాహనతో సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.పి. గౌతమ్ అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీ మంగళవారం జరుగనున్న కౌంటింగ్ కొరకు నియమించబడిన సిబ్బందికి సోమవారం డి.పి.ఆర్.సి భవనంలో శిక్షణ తరగతులను నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఎన్నికల సాధారణ పరిశీలకులు సి. సుదర్శన్ రెడ్డి హాజరై శిక్షణ తరగతుల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం. జిల్లాలో పోలింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంతంగా జరిగిందని, అదే తరహా కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా ఎన్నికల మార్గదర్శకాలను పూర్తిగా అవగాహన చేసుకోవాలని, కౌంటింగ్ కొరకు నిర్దేశించిన విధానం పట్ల సమగ్ర అవగాహన కలిగి ఉండాలని, శిక్షణ తరగతుల ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 10వ తేదీన జరిగిన పోలింగ్కు సంబందించిన బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లో భద్రపర్చి మూడు అంచెల భద్రత కల్పించడం జరిగిందని, అట్టి బ్యాలెట్ బాక్సులను ఈ నెల 14 వ తేదీ మంగళవారం ఉదయం 7.00 గంటలకు ఎన్నికల పరిశీలకులు, పోటీలో ఉన్న అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ నుండి కౌంటింగ్ కు తరలించడం జరుగుతుందని ఉదయం 8.00 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలలో అభ్యర్థులు ఓటర్లు తక్కువ సంఖ్యలో ఉన్నారని కౌంటింగ్ ప్రక్రియను పూర్తి అవగాహన చేసుకోవడం వల్ల ఓట్ల లెక్కింపు సులువు అవుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రాధాన్యతపరంగా ఓట్ల లెక్కింపు ఉంటుందని, ముఖ్యంగా చెల్లుబాటు అయినవి, చెల్లుబాటు కాని ఓట్ల పట్ల సమగ్ర అవగాహన ఉండాలని -కలెక్టర్ అన్నారు. ఓట్ల లెక్కింపుకు సంబంధించిన అన్ని రకాల ఫారాలను పూర్తిగా సరియైన పద్ధతిలో పూరించాలని, అభ్యర్థులకు పోలైన ఓట్లను ఏజెంట్లకు తెలియపర్చాలని, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు శిక్షణ తరగతుల ద్వారా సమగ్ర అవగాహనతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

అదనపు కలెక్టర్, సహాయ రిటర్నింగ్ అధికారి ఎన్. మధుసూదన్, శిక్షణ తరగతుల నోడల్ అధికారులు శ్రీరామ్, శైలేంద్ర, కౌంటింగ్ సిబ్బంది, ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్ రాంబాబు, తదితరులు శిక్షణా తరగతుల కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post