ఎన్నికల సాధారణ పరిశీలకులు హుజురాబాద్ గెస్ట్ హౌస్ లో ఫిర్యాదుల స్వీకరణ

ఎన్నికల సాధారణ పరిశీలకులు హుజురాబాద్ గెస్ట్ హౌస్ లో ఫిర్యాదులు స్వీకరిస్తారు.

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

 

 

హుజురాబాద్ ఉప ఎన్నికల నిర్వహణ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు ముత్తు కృష్ణన్ శంకరనారాయణన్ ఐ.ఏ.ఎస్., గారు హుజురాబాద్ గెస్ట్ హౌజ్ లో అన్ని పనిదినాలలో (వర్కింగ్ డేస్) లలో సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎన్నికలకు సంబంధించిన అన్ని ఫిర్యాదులను స్వయంగా స్వీకరిస్తారని, వెంటనే ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకుంటారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకుల ఫోన్ నెం. 7093081628 . ఈ ఫోన్ నెంబరుకు కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులు తెలిపినచో వెంటనే స్పందించి తక్షణ చర్యలు గైకొంటారని పేర్కొన్నారు.

Share This Post