ఎన్నో ఏండ్ల నుండి వివక్ష నిరాదరణకు గురై ఆర్థికంగా అణగారిన దళితులకు వారి హక్కులు కల్పించిన తొలి నేత తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

పత్రిక ప్రకటన
తేది: 3-10-2022
నాగర్ కర్నూల్ జిల్లా
ఎన్నో ఏండ్ల నుండి వివక్ష నిరాదరణకు గురై ఆర్థికంగా అణగారిన దళితులకు వారి హక్కులు కల్పించిన తొలి నేత తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
దళితబంధు పైలెట్ ప్రాజెక్టు కింద నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం ఎంపిక కాగా సోమవారం కల్వకుర్తి నియోజకవర్గంలోని 6 గ్రామాల 304 మంది లబ్ధిదారులకు జూపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా (9) రకాల యూనిట్లును స్థానిక శాసన సభ్యులు జి. జైపాల్ యాదవ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ దళితులు ఎన్నో సంవత్సరాలుగా నిరాదరణకు గురై అర్థకంగా, సామాజికంగా వెనుకబడ్డారని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు వారి ఆర్థిక స్థితిగతులను చూసి దళితబంధు రూపంలో హక్కును కల్పించారని అందుకే లబ్ధిదారుల బదులు హక్కు గా పేర్కొంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి మానసపుత్రిక అయిన దళితబంధును పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో 4 మండలాలను ఎంపిక చేయగా అందులో చారగొండ ఉండటం విశేషమన్నారు. ఏదైనా సరే చెప్పి చేయడంలో కె.సి.ఆర్. కు సాటి మరెవ్వరూ లేరన్నారు. రాష్ట్రంలో సంపదను పెంచేందుకు 75 శాతం వ్యవసాయ రాష్ట్రంలో నదుల ద్వారా సాగు నీరు ఇచ్చి, 24 గంటల ఉచిత విద్యుత్తు, పెట్టుబడి సాయంగా రైతుబందు, రైతు భీమా ఇచ్చి ప్రజలకు పని కల్పించడం ద్వారా నేడు దేశానికి అన్నం పెట్టే స్తాయికి, అత్యధిక వార్షికాదాయం కలిగిన రాష్ట్రంగా తెలంగాణా నిలిచిందన్నారు. ఒకసారి అవకాశం కల్పిస్తే కష్టపడి పనిచేసిబి ఆర్థికంగా బలోపేతం అయి మరికొంతమంది కి ఊపాది కల్పిస్తారని భావించి దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ రోజు చారగొండ మండలానికి సంబంధించి కల్వకుర్తి నియోజకవర్గములోని 6 గ్రామాల్లోని 676 దళిత కుటుంబాలకు 59 రకాల యూనిట్లు మంజూరు అయ్యాయని అందులో యాంత్రికపరమైన 304 యూనిట్లను ఇప్పుడు హక్కుదారులకు పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. రైతుబందు, దళితబంధు, ఉచిత విద్యుత్తు పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. స్థానిక శాసన సభ్యులు కోరినట్లు అమాన్గల్ మండలంలో ఏ.డి ఏ కార్యాలయం మంజూరు చేసి త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కొత్త మండలాలకు గోదాముల త్వరలోనే మంజూరు అవుతాయని, రాష్ట్రంలో ఇతర మండలాలతో పాటు కొత్తగా మంజూరు అయిన మండలాలకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉండేవిధంగా మండల కాంప్లెక్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, అచ్ఛంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజ్ మాట్లాడుతూ కల్వకుర్తి శాసన సభ్యులు , గ్రామ పెద్దల సహకారంతో అచ్ఛంపేట లోని కొన్ని గ్రామాలు, కల్వకుర్తిలోని కొన్ని గ్రామాలు కలిపి చారగొండ మండలంగా ఏర్పడిందన్నారు. న్యాయం చేయాలని ఉదేశ్యంతో పైలెట్ ప్రాజెక్టు కింద చారగొండ మండలాన్ని ఎంపిక చేయడం జరిగిందన్నారు. మండలంలోని ప్రతి దళిత కుటుంబానికి యూనిట్ ఇప్పించే బాధ్యత తమదేనని భరోసా ఇచ్చారు. కొత్తగా పెళ్లి అయిన కుటుంబాలకు సైతం లబ్ది చేకూరేవిధంగా చూడాలని మంత్రిని కోరారు. తెలంగాణలో కె.సి ఆర్ ఆమలు చేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా డిమాండు చేసేవిధంగా ఉన్నాయన్నారు. మండలంలోని ప్రతి దళితకుటుంబానికి దళితబంధు మంజూరు చేయడం జరిగిందని అయితే దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి దూరదృష్టితో చేతికి డబ్బులు ఇవ్వకుండా యూనిట్లకు మాత్రమే డబ్బులు ఇచ్చేవిధంగా చేయడం జరిగిందన్నారు. 9.90 లక్షల లోపు ఒకటి గాని అంతకన్నా ఎక్కువ యూనిట్లు తీసుకోవచ్చని తెలియజేసారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కల్వకుర్తి శాసన సభ్యులు జి. జైపాల్ యాదవ్ మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని పథకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అమలు చేయడం జరుగుతుందన్నారు. దళితులను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేసేందుకుం దళితబంధు పథకం ప్రవేశపెట్టారన్నారు. చారగొండను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని ఇక్కడ ఉన్న ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల విలువ గల యూనిట్లను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి చంద్రాయన్ పల్లి,ఎర్రవల్లి, గోకారం, జైపల్లి, జూపల్లి, సేరి అప్పరెడ్డి పల్లి గ్రామంలోని 676 దళిత కుటుంబాలను గుర్తించి ఒక్కొక్కరికి 10 లక్షల విలువ కలిగిన వారు కోరుకున్న యూనిట్లను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ రోజు 304 యూనిట్లు 30.09 కోట్ల విలువ కలిగిన 145 ట్రాక్టర్లు, 45 ప్యాసింజర్ కార్లు, రవాణా వాహనాలు, 21 సెంట్రింగ్ మెటీరియల్, 7 టెంట్ హౌస్ లు, 1 కాంక్రీట్ మిక్సర్, 46 మినీ డైరీ యూనిట్లు, 9 గొర్రెల యూనిట్లు,8 పౌల్ట్రీ యూనిట్లు, జే.సి.బి లు గ్రౌండింగ్ చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన వారికి సైతం త్వరలో ఇవ్వడం జరుగుతుందన్నారు. కొత్తగా ఏర్పడిన చారగొండలో మండల కాంప్లెక్ మంజూరు చేయాలని, అమాన్ గల్ లో మండల వ్యవసాయ కార్యాలయం ఏర్పాటు చేయాలని, కొత్త మండలాలకు గోదాముల మంజూరు చెయాల్సిందిగా మంత్రిని కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు పి. రాములు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన ఇంకా దళితులు బాగుపడలేదని గ్రహించిన రాష్ట ముఖ్యమంత్రి దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రైతుబందు, దళితబంధు త్వరలో గిరిజన బంధు, బి.సి బంధు పెట్టనున్న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ప్రజాబంధు గా పేరు తెచ్చుకుంటున్నారన్నారు. చారగొండ లో 1407 మంది దళిత కుటుంబాలను గుర్తించి అందరికి ఉచితంగా దళిత బంధు యూనిట్లు ఇవ్వడం జరుగుతుందని చారగొండ ప్రజలకు రెండు రోజులు ముందుగానే దసరా పండుగ వచ్చేసిన పండగ వాతావరణము ఉందన్నారు.
జడ్పి చైర్మన్ పి. పద్మావతి మాట్లాడుతూ 75 సంవత్సరాల నుండి దళితులను ఏ ప్రభుత్వము పట్టించుకోలేదని, తెలంగాణా ప్రభుత్వం వచ్చాక దళితులతో పాటు అన్ని సామాజిక వర్గాలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు. పార్లమెంటుకు సైతం అంబెడ్కర్ పెరు పెట్టాలని సభలో తీర్మానం చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ చారగొండను పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించగా మండలంలో 1407 మంది దళిత కుటుంబాలను గుర్తించినట్లు తెలిపారు. వీరందరి ఖాతాలో రూ. 9.90 లక్షలు జమ చేయడం జరిగిందన్నారు. మిగిలిన 10 వేల రూపాయలు దళితుల రక్షణ నిధిగా జమ చేయడం జరిగిందన్నారు. లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన 9.90 లక్షల రూపాయాలలో వారికి నచ్చిన యూనిట్ ఒకటి కాని అంతకన్నా ఎక్కువ యూనిట్లు తీసుకోవచ్చన్నారు. అంతకన్నా ఎక్కువ విలువ గల యూనిట్ కావాలంటే మిగిలిన డబ్బులు లబ్దిదారుడు జమ చేసి తీసుకోవచ్చని సూచించారు. దళితబంధు అనేది పూర్తిగా ఉచితంగా ఇస్తున్నదని దీనిని సద్వినియోగం చేసుకొని కష్టపడి రెండింతల ఆదాయం సముపార్జించుకోవాలని కోరారు. మీతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించే విధంగా ఎదగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ చారగొండ దళితులు అదృష్టవంతులు అని అన్నారు. ఈ మండలంలోని ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు రావడం సంతోషకరమన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, జిల్లా ఎస్సి కార్పొరేషన్ అధికారి రాంలాల్, ఆర్డీఓ రాజేష్ కుమార్, ఎంపీపీ నిర్మల విజేందర్, సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ రావు, దుర్గయ్య, మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, కో అప్షన్ మెంబర్ సలీమ్,గొనె శ్రీనివాస్ రెడ్డి, జడ్పిటిసిలు సర్పంచులు తదితరులు, దళిత బంధు లబ్దిలిదారులు, ప్రజలు పాల్గొన్నారు.
—————
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వారా జారీ.

Share This Post