ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న JNNURM ఇండ్ల కేటాయింపు ప్రక్రియకు ముందడుగు పడింది. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవ తో అర్హులైన లబ్దిదారులకు ఇండ్లను కేటాయించేందుకు చర్యలకు అధికారులు సిద్దమవుతున్నారు.

అందులో భాగంగా పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన పలువురు MLA లు, రెవెన్యూ, హౌసింగ్, GHMC శాఖల అధికారులతో గురువారం మాసాబ్ ట్యాంక్ లోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, అంబర్ పేట, కంటోన్మెంట్, గోషామహల్, మలక్ పేట్ MLA లు కాలేరు వెంకటేష్, సాయన్న, రాజాసింగ్, బలాలా, జిల్లా కలెక్టర్ శర్మన్, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, RDO లు వసంత, వెంకటేశ్వర్లు, చాంద్రాయణ గుట్ట కార్పొరేటర్ సలీం బేగ్, హౌసింగ్ CE సురేష్, EE వెంకటదాసు రెడ్డి, పలువురు తహసిల్దార్ లు   తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ ల పరిధిలోని సికింద్రాబాద్ నియోజకవర్గంలో హమాలీ బస్తీ, సనత్ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని గైదన్ బాగ్ కస్తుర్బా నగర్, ఓల్డ్ పాటిగడ్డ, NBT నగర్ లలో, కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని LIC కాలనీ లో, అంబర్ పేట్ నియోజకవర్గ పరిధిలోని వీరన్నగుట్ట, చాంద్రాయణ గుట్ట నియోజకవర్గ పరిధిలోని సర్వే నెం 82, 128, 83, ఉప్పుగూడ ఎక్స్ సర్వీస్ మెన్ ప్రాంతాలలో, గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని పూల్ బాగ్ –1,2 మలక్ పేట నియోజకవర్గ పరిధిలోని నందనవనం-2, ముంగనూర్ తదితర 15 ప్రాంతాలలో 2007-2008 సంవత్సరంలో 10,210 ఇండ్లు మంజూరు కాగా, 10,178 ఇండ్లను నిర్మించారు. ఇందులో 7,842 ఇండ్లను లబ్దిదారులకు అందజేశారు. నాటి నుండి వివిధ కారణాలతో 2336 ఇండ్ల కేటాయింపు పెండింగ్ లో ఉంది. 2336 ఇండ్లలో 1266 ఇండ్లను అర్హులకు పంపిణీ చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని అధికారులు మంత్రికి వివరించారు. సుమారు 14 సంవత్సరాలుగా అనేకమంది అర్హులు ఇండ్ల కేటాయింపు కోసం ఎదురుచూస్తున్నారని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రెవెన్యూ, హౌసింగ్ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి స్థానిక MLA ల సహకారంతో లబ్దిదారులను గుర్తించి మిగిలిన 1070 ఇండ్లను కూడా కేటాయించే ప్రక్రియను చేపట్టి వేగంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

 

Share This Post