ఎన్నో సంవత్సరాలు గా వరద ముంపుకు గురవుతున్న ప్రజల దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలోచనతోనే సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఆదర్శనగర్ లోని MLA క్వార్టర్స్ లో గల తన కార్యాలయంలో SNDP ప్రాజెక్ట్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఎన్నో సంవత్సరాలు గా వరద ముంపుకు గురవుతున్న ప్రజల దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలోచనతోనే సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఆదర్శనగర్ లోని MLA క్వార్టర్స్ లో గల తన కార్యాలయంలో SNDP ప్రాజెక్ట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. 45 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బేగంపేట నాలా, 10 కోట్ల రూపాయల వ్యయంతో పికెట్ నాలా పై చేపట్టిన బ్రిడ్జి విస్తరణ నిర్మాణ పనులపై సమీక్షించారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఎగువ నుండి వచ్చే వరదనీటితో బేగంపేట నాలా పరిధిలోని బ్రాహ్మణ వాడి, వడ్డెర బస్తీ, ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాలు ముంపుకు గురై ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నగరంలో ఉన్న అనేక నాలాల వద్ద ఇదే పరిస్థితులు ఉన్నాయని, గత పాలకులకు ఎంత మొర పెట్టుకున్నా పట్టించుకోలేదని, మున్సిపల్ శాఖ మంత్రి KTR చొరవతో సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అందులో భాగంగా బేగంపేట నాలా కు ఇరువైపుల రిటైనింగ్ వాల్స్ నిర్మాణంతో పాటు పూడిక తొలగించే పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతోనే ఈ సంవత్సరం వరదముంపు సమస్య ప్రభావం తీవ్రత చాలా తగ్గిందని తెలిపారు. అదేవిధంగా పికెట్ నాలా  నూతన బ్రిడ్జిని విస్తరించి నిర్మించడం వలన ముంపు సమస్య పరిష్కారం కానున్నదని చెప్పారు. పికెట్ నాలాపై ఇప్పటికే ఒక వైపు బ్రిడ్జి నిర్మాణం పూర్తయి రాకపోకలు కొనసాగుతున్నాయని, రెండోవైపు పనులు అక్టోబర్ 20 వ తేదీ నాటికి పూర్తి చేసి అందుబాటులో కి తీసుకు రానున్నట్లు చెప్పారు. పనులు మరింత వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలని చెప్పారు. ఈ సమావేశంలో SNDP SE భాస్కర్ రెడ్డి, EE శ్రీనివాస్, DE సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post