ఎన్. వై.కె. ఆధ్వర్యంలో దేశభక్తి – దేశనిర్మాణం పై ఉపన్యాస పోటీల నిర్వహణ*

నెహ్రూ యువ కేంద్రం, నల్లగొండ వారి ఆధ్వర్యంలో  సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ (కలిసి ఎదుగుదాము, కలిసి అభివృద్ధి చెందుతాము, కలిసి ప్రయత్నిస్తాము) అనే దేశభక్తి & దేశ నిర్మాణం అంశంపై ఉపన్యాస(declamation) జిల్లా స్థాయి పోటీ రెడ్ క్రాస్ భవన్ లో పోటీ నిర్వహించండం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గోలి అమరేందర్ రెడ్డి రెడ్ క్రాస్ చైర్మన్ గారు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి యువత ఇలాంటి కారక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. జిల్లా స్థాయి పోటీలో గెలుపొందిన వారికి 1వ బహుమతి. 5000/-, 2వ బహుమతి. 2000/-, 3వ బహుమతి. 1000/-  మరియు విజేతలకు ప్రశంశ పత్రము అందించడం జరిగింది. మొదటి బహుమతి యెన్ విష్ణు, ద్వితీయ బహుమతి కీర్తి ప్రియా, తృతీయ బహుమతి అడ్ల తేజశ్రీ పొందారు. గెలుపొందిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి ప్రవీణ్ సింగ్, యాదగిరి రెడ్డి, జ్యోతి, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కొండా నాయక్, యూత్ క్లబ్స్, యూత్ వాలంటీర్స్, రెడ్ క్రాస్ యూత్, యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post