DPRO ADB ఎఫ్.ఆర్.సి. కమిటీలను ఏర్పాటు చేయండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ప్రతి హాబిటేషన్ కి ఎఫ్.ఆర్.సి. టీమ్ ను ఏర్పాటు చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో తహసీల్దార్లు, ఎంపీడీఓ లతో పోడు భూముల క్లెయిమ్స్ కు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, అటవీ హక్కు చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, చట్టప్రకారం పోడుభూములు సాగు చేస్తున్న వారికీ హక్కు పత్రాలు జారీ చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి గ్రామానికి అటవీ హక్కుల కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలనీ అన్నారు. శనివారం లోగా కమిటీల ఏర్పాటు పూర్తిచేయాలని అన్నారు. అర్జీదారు సమర్పించే ఫారం- ఏ లను సరఫరా చేస్తామని తెలిపారు. నిబంధనల మేరకు అటవీ హక్కుల కమిటీలను సంబంధిత సభ్యులు, మహిళలు ఉండేవిధంగా ఏర్పాటు చేయాలనీ సూచించారు. అనంతరం మండలాలవారీగా పోడు వ్యవసాయం చేస్తున్న హాబిటేషన్ లు, కమిటీల ఏర్పాటులపై సంబంధిత తహసీల్దార్లను, ఎంపీడీఓ లను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ITDA ప్రాజెక్టు అధికారి అంకిత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, ఆర్డీఓ రాజేశ్వర్, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post