*ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ను పరామర్శించిన ముఖ్యమంత్రి కె. సి.ఆర్.*

నల్గొండ జిల్లా తుంగతుర్తి శాసన సభ్యులు గాదరి కిషోర్ కుమార్ ను , ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరామర్శించారు. ఇటీవల మరణించిన శాసన సభ్యులు గాదరి కిశోర్ కుమార్  తండ్రి గాదరి మారయ్య  పెద్ద కార్యం లో పాల్గొని గాదరి కిశోర్ కుమార్  కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధవారం ముఖ్యమంత్రి హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా నల్గొండ కు చేరుకున్నారు.అనంతరం హెలిపాడ్ నుండి నేరుగా నల్గొండ పట్టణం లోని  శాసనసభ్యులు  గాదరి కిషోర్ కుమార్ ఇంటికి చేరుకున్నారు. ఇంటివద్ద గాదరి కిషోర్ కుమార్ తండ్రి కీ.శే. గాదరి మారయ్య  చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, హరీష్ రావు,ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, రాజ్య సభ సభ్యులు సంతోష్ కుమార్,బడుగుల లింగయ్య యాదవ్, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యా సాగర్, వి. శ్రీనివాస్ గౌడ్, శాసన మండలి సభ్యులు ఎం.సి.కోటి రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,రవీంద్ర నాయక్, చిరుమర్తి లింగయ్య, సైది రెడ్డి,నోముల భగత్,ఎన్. భాస్కర్ రావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,ఎస్.పి.రిమా రాజేశ్వరి, మున్సిపల్ చైర్మన్ యం. సైది రెడ్డి,వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ అదనపు కలెక్టర్ లు రాహుల్ శర్మ, వి.చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు
ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ను పరామర్శించిన ముఖ్యమంత్రి కె. సి.ఆర్.*

Share This Post