ఎమ్మెల్సి ఎన్నికల పోలింగ్ కు అన్ని విధాల సిద్దంగా ఉండాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకటన..3 తేదిః 09-12-2021
ఎమ్మెల్సి ఎన్నికల పోలింగ్ కు అన్ని విధాల సిద్దంగా ఉండాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, డిసెంబర్ 09: రేపు (తేదిః 10-12-2021) ఉదయం నుండి జగిత్యాల, కోరుట్ల లో జరుగనున్న ఎమ్మెల్సి ఎన్నికల పోలింగ్ కు ముందుగానే సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి.రవి సూచించారు. స్థానిక సంస్థల అధనపు కలెక్టర్, అర్డీఓలు మరియు తహసీల్దార్లతో వివిధ రెవెన్యూ అంశాలతో పాటు, ఎమ్మెల్సి ఎన్నికల నిర్వహణ పై జూమ్ వెబ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, రేపు ఉధయం నుండి జరిగే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేసుకోవాలని, పోలింగ్ కేంద్రానికి 100మీటర్ల వరకు ఎటువంటి దూఖాణాలు, కార్యాలయాలు మరియ ఏ ఇతర కార్యక్రమాలు జరగకుండా చూడాలని, పోలింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు ముందుగానే చూసుకొవాలని, ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి భోజనం, అల్పాహారం ఏర్పాట్లను చేయాలని సూచించారు. ఎటువంటి పొరపాట్లు దొర్లకుండా సజావుగా ఎన్నికలు పూర్తయ్యేలా చూడాలని పేర్కోన్నారు.
కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ ధరఖాస్తుల పై సత్వర చర్యలు తీసుకోని లబ్దిదారులకు చెక్కులను అందించేలా కృషి చేయాలని పేర్కోన్నారు. స్లాట్ బుక్కింగ్ కొరకు ధరఖాస్తు చేసుకున్న వాటిలో పెండింగ్ లేకుండా చూడాలని, బి ఆండ్ ఎస్స్ ఎల్ ఏ లొ పెండింగ్ లేకుండా చూడాలని అన్నారు. భూ సంబంధిత అంశాలకు సంబంధించిన ధరఖాస్తులను కలెక్టర్ కార్యాలయానికి పంపించాలని, పిఓబి ధరఖాస్తుల కేసులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు. ఫామ్ 7 పూర్తిచేసి మరణించిన వారి వివరాలను తొలగించడంలో జగిత్యాల రాష్ట్రంలోనే మంచిస్థానంలో నిలిచిందని పేర్కోన్నారు.
కోవిడ్ మరణాలపై వచ్చే దరఖాస్తులలో కుటుంబ సభ్యుల, బ్యాంకు వివరాలను సరిగా చూసుకోవాలని, డబ్బుల చెల్లింపులో జాగ్రత్త వహించాలని, మిల్లుల దగ్గర దాన్యంతో మిల్లుకు వచ్చే లారీలు దిగుమతిలో అలస్యం జరగకుండా ఎప్పటికప్పడు పరిశీలించాలని పేర్కోన్నారు.

ఎమ్మెల్సి ఎన్నికల పోలింగ్ కు అన్ని విధాల సిద్దంగా ఉండాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జిల్లా పౌరసంబంధాల ఆధికారి కార్యాలయం, జగిత్యాల చే జారి చేయనైనది.

Share This Post