ఎమ్మెల్సీ ఎన్నికలకు 23 మంది అభ్యర్థులు 53 నామినేషన్ దాఖలు: రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

పత్రికా ప్రకటన తేది 23 11 2021
కరీంనగర్

ఎమ్మెల్సీ ఎన్నికలకు 27 మంది అభ్యర్థులు 53 నామినేషన్ దాఖలు

రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

000000

07 కరీంనగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి స్థానాలకు చివరి రోజున 13 మంది అభ్యర్థులు 31నామినేషన్ లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు.

కలెక్టరేట్ సమావేశ మందిరంలో అయన నామినేషన్ లను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం రోజున 13 మంది అభ్యర్థులు 31 నామినేషన్లను దాఖలు చేసినారని తెలిపారు. కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం 27 మంది అభ్యర్థులు 53 నామినేషన్ లు సమర్పించారని తెలిపారు.

సహాయ సంచాలకులు జిల్లా పౌరసంబంధాల అధికారి కరీంనగర్ జారీ చేయడమైనది

Share This Post