ఎమ్మెల్సీ ఎన్నికలలో 3 నామినేషన్లు తిరస్కరణ: జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

ఎమ్మెల్సీ ఎన్నికలలో 3 నామినేషన్లు తిరస్కరణ:

జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
-000-

07- కరీంనగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకు సమర్పించిన నామినేషన్లలో ముగ్గురి నామినేషన్లు తిరస్కరించబడినట్లు రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు.

కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఎన్నికల పరిశీలకులు టి.విజయ్ కుమార్ సమక్షంలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్క్రుటిని నిర్వహించినట్లు తెలిపారు. కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం 27 మంది అభ్యర్థులు 53 నామినేషన్లు సమర్పించారని, నామినేషన్ల స్క్రుటిని లో 1) శ్రీకాంత్ సిలివేరు, 2) రాజు పిడిశెట్టి, 3) వేముల విక్రమ్ రెడ్డి, ముగ్గురి నామినేషన్లు తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. స్క్రుటిని అనంతరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో 24 మంది ఉన్నట్లు ఆయన తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం, శుక్రవారం రెండు రోజుల గడువు ఉన్నట్లు ఆయన తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని రిటర్నింగ్ అధికారి తెలిపారు.

 

Share This Post