ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు 72 గంటల ముందు ప్రచారం ముగించాలి : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు 72 గంటల ముందు ప్రచారం ముగించాలి :

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
000

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 10 న జరగనున్నందున ఎన్నికల పోలింగ్ కు 72 గంటల ముందు ప్రచారం ముగించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 07‌- కరీంనగర్ స్థానిక సంస్థల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు 72 గంటల ముందు అనగా డిసెంబర్ 07 సాయంత్రం 7-00 గంటల నుండి డిసెంబర్ 10 పోలింగ్ ముగిసే వరకు నిశబ్ధ కాలం (సైలెన్స్ పిరియడ్) అని ఆయన తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం – 1951 సెక్షన్ (126) ప్రకారం ఎన్నికల ప్రచారానికి సంబంధించి రాజకీయ పార్టీలు, మీడియా కార్యక్రమాలు నిర్వహించరాదని, ఎన్నికలకు సంబంధించిన ప్రచార సభలు, సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించరాదని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సినిమాటోగ్రాఫీ, టెలివిజన్, ప్రచార సామాగ్రి ప్రజలకు తెలిపే విధంగా ప్రదర్శించరాదని అన్నారు. మ్యూజికల్ కచేరిలు, ఇతర వినోద కార్యక్రమాలు నిర్వహించరాదని ఆయన తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారికి రెండు సంవత్సరముల వరకు జైలు శిక్ష లేదా ఫైన్ విధించబడునని లేక రెండు శిక్షలను విధించబడునని ఆయన తెలిపారు.

Share This Post