ఎయిడ్స్ మహమ్మారి నిర్ములనకు జిల్లాలో పనిచేస్తున్న వివిధ స్వచ్చంద సంస్థలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖతో కలిసి సమన్వయం చేసుకుంటూ పనిచేయాలి- జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

ఎయిడ్స్ మహమ్మారి నిర్ములనకు జిల్లాలో పనిచేస్తున్న వివిధ స్వచ్చంద సంస్థలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖతో కలిసి సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు.
డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఆరోగ్య శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు జిల్లాలో ఎయిడ్స్, టీ.బి, కుష్టు వంటి రోగాలను అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమాలను కూలంకషంగా కలెక్టర్ సమీక్షించారు.
గ్రామాల వారీగా ఉన్న రోగుల వివరాలను వారికి అందిస్తున్న చికిత్సలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో 1510 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ….
వ్యాధి వ్యాప్తికి గుర్తించిన
హాట్ స్పాట్ ప్రదేశాలలో అవగాహన విస్తృతంగా కల్పించడం ద్వారా వ్యాధి నివారించవచ్చని సూచించారు.
ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి వ్యాధి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అదేవిధంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నుండి ప్రజలు రక్షణ పొందేందుకు కావలసిన పకడ్బందీ ఏర్పాట్లు లతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసిన వారిలో డాక్టర్ రోహిత్, రాజ వర్ధన్ రెడ్డి, కృష్ణారావు, గణేష్, మంతటి శ్రీను, యాదయ్య, అనంతయ్య రవి, నరేష్ లను అభినందిస్తూ ప్రశంసాపత్రాన్ని మెమొంటో అందజేశారు.
నాగర్కర్నూల్ పట్టణానికి చెందిన హెచ్. విశ్వ ప్రసాద్ 55 సార్లు రక్తదానం చేసిన సందర్భంగా ఆయనను కలెక్టర్ అభినందించి మెమెంటో, ప్రశంసా పత్రంతో సత్కరించారు.
కోత్త వేరియంట్ కరోనా వస్తుందని ప్రచారం జరుగుచున్నందున ఎలాంటి పరిస్తితినైన ఎదుర్కొనేందుకు రక్తం యూనిట్లు, ప్లాజ్మా యూనిట్లు అవసరం పడితే అందుబాటులో ఉంచి ప్రాణాలు కాపాడుకునే విధంగా రెడ్ క్రాస్ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇందుకు రక్తదానం చేసే సభ్యుల సంఖ్య ను పెంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్ లాల్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సాయినాథ్ రెడ్డి అదనపు డి ఎమ్ హెచ్ ఓ వెంకట దాస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాజశేఖర్, రెడ్ క్రాస్ కార్యదర్శి రమేష్ రెడ్డి, డాక్టర్N రోహిత్, డాక్టర్ శ్రవణ్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post