నెహ్రు యువ కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘం,నల్గొండ ఆధ్వర్యంలో సిద్ధార్థ డిగ్రీ కాలేజీ సెమినార్ హాల్ లో ఎయిడ్స్ పై యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన డా. , IMA రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. పుల్లా రావు మాట్లాడుతూ యువత ఇలాంటి అవగాహన సదస్సులను ఉపయోగించుకోవాలని అన్నారు. యువత తమ తమ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. 2030 నాటికి ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. లైంగిక వ్యాధులు, ఎయిడ్స్ నివారణ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘం సభ్యులు సుధాకర్, సంపతయ్య, రవీందర్ వివరించారు. ఈ సదస్సులో ప్రవీణ్, శ్రీనివాస్, జానయ్య, కొండా నాయక్, సంపత్, యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు.
