ప్రచురణార్థం
01.12.2022 ( గురువారం)
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పట్ల వివక్ష తగదని సమాజంలో వారిని గౌరవప్రదమైన భావనతో చూసేలా ప్రజలలో ఒక అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి సంబంధిత వైద్యాధికారులను ఆదేశించారు
గురువారం రోజున ఎంజీఎంలో ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి దినోత్సవం సందర్భంగా వైరల్ హైపెటైటిస్ చికిత్స కేంద్రముని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజారోగ్య రక్షణ ధ్యేయంగా ప్రభుత్వ వైద్యశాలలు పనిచేస్తున్నాయని ఎలాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు అయినా చికిత్సలు అందించి వ్యాధుల బారి నుండి ప్రజలను రక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు హెచ్ఐవి బారిన పడినవారికి గుర్తించి ఆసరా పింఛన్ అందించే విధంగా చర్యలు చేపట్టాలని అలాగే ప్రభుత్వం నిబంధనలు ప్రకారం రైస్ పంపిణీ చేయాలని సంబంధిత అధికారులు కలెక్టర్ ఆదేశించారు
అంతకుముందు ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి దినోత్సవం పురస్కరించుకొని ప్రమాణం చేశారు నాకు తెలిసిన వారందరికీ అవగాహన పెంచి అపోహలను తొలగించి నాతో పాటుగా హెచ్ఐవి బారిన పడకుండా చేస్తానని హెచ్ఐవి ఉన్నవారిపట్ల గౌరవంతో స్నేహంగా మెలుగుతూ వారు క్రమం తప్పకుండా మందులు తీసుకుంటూ జీవనం కొనసాగించేలా చేస్తానని ప్రమాణం ముగించారు
ఈ కార్యక్రమంలో ఎంజీఎం సూపరిండెంట్ సంబంధిత వైద్యాధికారులు పాల్గొన్నారు