పత్రికా ప్రకటన తేది: 01-12-20 22
ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా పరిషత్ చైర్మన్ సరి తిరుపతయ్య అన్నారు.
గురువారం ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా లో కృష్ణవేణి చౌక్ లో ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి జండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ పాత బస్టాండ్ మీదుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వరకు నిర్వహించారు. హెచ్.ఐ.వి. ఏయిడ్స్ పై అవగాహానతో ప్రజలలో చైతన్యం కలిగించాలని, అనుమానితులు స్వచ్చందంగా ఆసుపత్రులలో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత హెచ్. ఐ.వి. నిర్ధారణ పరీక్షలు చేయించుకొని చికిత్స చేయించుకోవాలన్నారు. ఈ వ్యాది పై ప్రజలు అవగాహాన పెంచుకోవాలని, ప్రజలలో చైతన్యం కలగాలని ఈ రోజు ర్యాలీ, ఇతర కార్యక్రమాల ద్వారా అవగాహాన కల్పిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్, డాక్టర్ సిద్దప్ప, డాక్టర్ శశికళ, వైద్య సిబ్బంది తదితరలు పాల్గొన్నారు.
—————————————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాలచే జారీ చేయబడినది.