ఎయిడ్స్ వ్యాధి కన్నా సామాజిక రుగ్మత భయంకరం…

ప్రచురణార్థం

ఎయిడ్స్ వ్యాధి కన్నా సామాజిక రుగ్మత భయంకరం…

మహబూబాబాద్ డిసెంబర్ 1 :

ఎయిడ్స్ వ్యాధి సోకిన దాని కంటే సమాజంలో వారి పట్ల చూపే రుగ్మత అతి భయంకర మని, సమాజ తీరు మారే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక పిలుపునిచ్చారు.

బుధవారం ఐఎంఏ హాల్ లో ఉప వైద్యాధికారి మురళీధర్ ఆధ్వర్యంలో లో లో లో లో నిర్వహించిన ఎయిడ్స్ డే లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.

నేటి సమాజంలో ఎయిడ్స్ పై అవగాహన పెరిగిందని వ్యాధిగ్రస్తులు కూడా తగ్గారని అన్నారు.
కానీ ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల పాలిట వివక్షత అలాగే కొనసాగుతున్నదని ఇది సరికాదన్నారు సమాజంలో అందరూ సమానమేనని గ్రహించాలన్నారు.

జిల్లాలో ఎనిమిది వందల మంది ఎయిడ్స్ సోకిన వారు ఉండగా అందులో 772 మంది పింఛన్లకు అర్హులని 470 మందికి పింఛన్లు మంజూరు అవుతున్నందున మిగతా వారికి కూడా పింఛన్లు మంజూరు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఎయిడ్స్ పై చైతన్యానికి అవగాహనకు కృషి చేస్తున్న సర్వోదయ కరుణా మైత్రి స్వచ్ఛంద సంస్థలను కలెక్టర్ అభినందించారు.
అలాగే ప్రచార కార్యక్రమాలను కూడా విస్తృత పరుస్తూ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించడం అభినందించదగిన విషయమన్నారు.

ఈ సందర్భంగా ఎయిడ్స్పై గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు భూక్య వెంకట్ రాములు ఐఎంఏ హాల్ అధ్యక్షులు వీరన్న ఉప వైద్యాధికారి అంబరీష, ప్రసాద్ డాక్టర్లు సతీష్ కుమార్ రాజ్ కుమార్ బాలునాయక్ రవీంద్ర రావు వైద్య సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post