ఎయిడ్స్ సోకిన వ్యక్తుల పట్ల సమాజంలో వివక్ష తగదు:స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్

వార్త ప్రచురణ
ములుగు జిల్లా
తేదీ:01-12-2021,

ఎయిడ్స్ సోకిన వ్యక్తుల పట్ల సమాజంలో వివక్ష తగదని తప్పకుండా ప్రతి ఒక్కరు మన వంతు సామాజిక బాధ్యతగా తీసుకొని హెచ్ఐవి రోగి ని ప్రేమించి ఆదరించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు కావాల్సిన అన్ని మందులు అందుబాటులో ఉంచిన దని , గిరిజన సంక్షేమ, మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు

. బుధవారం రోజున గిరిజన సంక్షేమ, మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ సంబంధిత ప్రజాప్రతినిధులతో కలిసి ములుగు జిల్లా మేడారం పర్యటనలో భాగంగా జాకారం గట్టమ్మ అమ్మ వారిని దర్శించుకున్న అనంతరం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించుటకు మూలుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎయిడ్స్ నిర్మూలన ర్యాలీని మంత్రి గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రజలలో అవగాహన పెంపొందించాలని, అసమానతలను అంతం చేద్దాం ఎయిడ్స్ వ్యాధిని రూపుమాపడం అనే నినాదంతో స్లోగన్ చేస్తూ ర్యాలీ కొనసాగింది. ఈ వ్యాధి ప్రజలు కు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కేంద్రాలలో గల బస్ స్టాండ్ వద్ద, ముఖ్యమైన కూడళ్ళలో పాంప్లేట్ ద్వారా ప్రచారం నిర్వహించాలని అన్నారు. అంతకుముందు జిల్లా పౌరసంబంధాల అధికారి సాంస్కృతిక కళాకారుల ఆధ్వర్యంలో ఎయిడ్స్ నిర్మూలన పై పాటల రూపంలో అవగాహన కల్పించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, సిబ్బంది ప్రభుత్వ పాఠశాలల కళాశాలల విద్యార్థిని విద్యార్థులు ఆశా కార్యకర్తలు, విద్యార్థులు ఎయిడ్స్ నిర్మూలన ర్యాలీ లో హెచ్ఐవి దూరం పెడదాం సుఖవ్యాధులను అంతం చేద్దాం.
కండోమ్ తో హీరో అవుతారా ,హెచ్ఐవి అంటువ్యాధి కాదు- అంటించుకునే వ్యాధి, హెచ్ఐవి గురించి తెలుసుకోండి జీవితాన్ని ఆనందంగా మలచుకోండి అవగాహన ఆలోచన ఉంటే హెచ్ఐవి దూరం, అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య గారు పాల్గొని కళాశాల విద్యార్థులకు వ్యాస రచన పోటీలలో గెలుపొందిన వారికి జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఏ. అప్పయ్య, ఎయిడ్స్ మెడికల్ ఆఫీసర్ రవీందర్, సూపరిండెంట్ డాక్టర్ జగదీష్, డాక్టర్ శ్యామ్, ప్రజా ప్రతినిధులు,ములుగు మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్,ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి సుదీర్,జడ్పీటీసీ సఖినాల భవాని ప్రభుత్వ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

Share This Post