ఎయిర్ ఫోర్స్ లో చేరడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులకు రేపు గురువారం జూమ్ మీటింగ్ ద్వారా అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో బుధవారం ఆయన కళాశాలల విద్యార్థులతో మాక్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హైదరాబాద్ విండో ఆఫీసర్ కమాండర్ సజ్జ చైతన్య అవగాహన కల్పిస్తారని చెప్పారు. 17 నుంచి 21 ఏళ్ల వయసు గల ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులు హాజరుకావాలని సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. జూమ్ మీటింగ్లో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. —————– జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది.

Share This Post