ఎర్త్ అవర్ పోస్టర్నును ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

ఎర్త్ అవర్ పోస్టర్నును ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

హనుమకొండ మార్చి 20 :

ప్రతి సంవత్సరం మార్చి నెలలో చివరి శనివారం రోజున ఎర్త్ అవర్2007 సంవత్సరం నుండి ఈ ఎర్త్ అవర్ ప్రపంచ పర్యావరణ నిధి (WWF) ఆధ్వర్యంలో జరుపుతున్నట్లు హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ తెలిపారు, సోమవారం రోజున కలెక్టర్ కార్యాలయంలో ఎర్త్ అవర్ సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించి అనంతరం మాట్లాడుతూ, వాతావరణ మార్పులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గురించి అవగాహన పెంచడానికి గృహాలు , వ్యాపార కేంద్రాలు, ఇతర కార్యాలయాల్లో ఒక గంట పాటు విద్యుత్ కాంతులను ఆపివేసి పకృతిని కాపాడే విధంగా చేయాలని దీని ద్వారా కరెంటు వలన జరిగే నష్టాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేయడమే దీని ఉద్దేశమని మన దేశ గృహ అవసరాల నిమిత్తం దాదాపు 30% విద్యుత్ శక్తిని వినియోగించుకుంటున్నారని తెలిపారు, ఈ ఎర్త్ఆవర్ కార్యక్రమం మారి స్వచ్ఛంద సేవా సంస్థ, ప్రజ్వల్ రైతు ఉత్పదాల సంఘం మరియు వాకర్స్ అసోసియేషన్ నిర్వహణలో మార్చి చివరి శనివారం అయినటువంటి 25వ తేదీన మనమందరం రాత్రి 8:30 నుండి 9:30 ప్రాంతంలో కలిసికట్టుగా ఒక గంటపాటు విద్యుత్తును ఆపి సంఘీభావం తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ నిధి(WWF) ప్రాజెక్టు ఆఫీసర్ హర్ష శంకర్, మారి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ప్రాజెక్ట్ ఇన్చార్జ మండల పరశురాములు, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆరోగ్య రాజ్ డేవిడ్ ,ప్రాజెక్టు మేనేజర్ ఇన్నారెడ్డి ప్రజ్వల్ సీఈవో ప్రతినిధి రామ్మూర్తి, అక్కల రమేష్ తదితరులు పాల్గొన్నారు…..

Share This Post