ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన ఈవీఎం గోడౌన్ వద్ద భద్రత, సిబ్బంది హాజరు ఏప్పటిలాగే ఉండాలని అలాగే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ అన్నారు .

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన ఈవీఎం గోడౌన్ వద్ద భద్రత, సిబ్బంది హాజరు ఏప్పటిలాగే ఉండాలని అలాగే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ అన్నారు .

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతినెల ఈవీఎంలు భద్రపరిచిన గోదాముల తనిఖీ లో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఈవీఎం గోదామును తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన ఈవీఎం గోదాము భద్రతకు నియమించిన సిబ్బంది హాజరు అదేవిధంగా పోలీసు బందోబస్తు తదిత అంశాలను, ఈవీఎం ఆవరణ ను పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ వెంట స్థానిక సంస్థలు, రెవెన్యూ అదనపు కలెక్టర్
కే. సీతారామారావు, మహబూబ్ నగర్ అర్బన్ తహసిల్దార్ పార్థసారథి ,రెవెన్యూ ఇన్స్పెక్టర్ చైతన్య, ఎన్నికల విభాగం జాఫర్ తదితరులు ఉన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ నూతన కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఈవీఎం గోదాం నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు.

Share This Post