ఎలక్షన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు – జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్

ఎలక్షన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు – జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్

04-మెదక్ స్థానిక సంస్థల నియోజక వర్గం నుండి తెలంగాణా శాసన మండలి సభ్యుని ఎన్నికకు జిల్లా ఎన్నికల అధికారి మరియు మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ మంగళవారం నాడు ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇట్టి ఎన్నికకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని కలెక్టరేట్లు, ఆర్.డి.ఓ. కార్యాలయాలు, తహశీల్ధార్, మండల పరిషద్ కార్యాలయాలు, మునిసిపాలిటీలలో నోటీసు బోర్డులపై ప్రదర్శించవలసినదిగా సంబంధిత అధికారులకు సూచించారు. (మంగళవారం) నేటి నుండి ప్రభుత్వ సెలవు దినాలైన 19, 21 మినహా ఈ నెల 23 వరకు నామినేషన్లు ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ లేదా సహాయ ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ నుండి నిర్దేశించిన సమయంలో పొంది అట్టి పత్రాలను ఎన్నికల అధికారి లేదా సహాయ ఎన్నికల అధికారి ఛాంబర్ లో అభ్యర్థి గాని, అతని ప్రతిపాదికునిచే గాని అందజేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇట్టి నామినేషన్ పత్రాలను ఈ నెల 24 న పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. నామినేషన్ ఉపసంహరించుకునే అభ్యర్థులు ఈ నెల 26 న మధ్యాన్నం 3 గంటల లోగా నోటీసును ఎన్నికల అధికారి లేదా సహాయ ఎన్నికల అధికారికి అభ్యర్థి లేదా అతని ప్రతిపాదకునిచే అందజేయాలని అన్నారు. పోలింగు డిసెంబర్ 10 న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి హరీష్ తెలిపారు. కాగా మంగళ వారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల నియోజక వర్గ ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్ ఆవరణలోని జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో మీడియా కేంద్రం ఏర్పాటుతో పాటు కలెక్టరేట్ లో 04-మెదక్ స్థానిక సంస్థల నియోజక వర్గం నుండి తెలంగాణా శాసన మండలి సభ్యుని ఎన్నికకు జిల్లా ఎన్నికల అధికారి మరియు మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ మంగళవారం నాడు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఇట్టి ఎన్నికకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని కలెక్టరేట్లు, ఆర్.డి.ఓ. కార్యాలయాలు, తహశీల్ధార్, మండల పరిషద్ కార్యాలయాలు, మునిసిపాలిటీలలో నోటీసు బోర్డులపై ప్రదర్శించవలసినదిగా సంబంధిత అధికారులకు సూచించారు. (మంగళవారం) నేటి నుండి ప్రభుత్వ సెలవు దినాలైన 19, 21 మినహా ఈ నెల 23 వరకు నామినేషన్లు ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ లేదా సహాయ ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ నుండి నిర్దేశించిన సమయంలో పొంది అట్టి పత్రాలను ఎన్నికల అధికారి లేదా సహాయ ఎన్నికల అధికారి ఛాంబర్ లో అభ్యర్థి గాని, అతని ప్రతిపాదికునిచే గాని అందజేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇట్టి నామినేషన్ పత్రాలను ఈ నెల 24 న పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. నామినేషన్ ఉపసంహరించుకునే అభ్యర్థులు ఈ నెల 26 న మధ్యాన్నం 3 గంటల లోగా నోటీసును ఎన్నికల అధికారి లేదా సహాయ ఎన్నికల అధికారికి అభ్యర్థి లేదా అతని ప్రతిపాదకునిచే అందజేయాలని అన్నారు. పోలింగు డిసెంబర్ 10 న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి హరీష్ తెలిపారు. కాగా మంగళ వారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల నియోజక వర్గ ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్ ఆవరణలోని జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో మీడియా కేంద్రం ఏర్పాటుతో పాటు కలెక్టరేట్ లో ఎలక్షన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని వివరాలకు 08452-223360 లేదా 7995088720 మొబైల్ ఫోన్ కు సంప్రదించవచ్చని కలెక్టర్ తెలిపారు. చేశామని వివరాలకు 08452-223360 లేదా 7995088720 మొబైల్ ఫోన్ కు సంప్రదించవచ్చని కలెక్టర్ తెలిపారు.

Share This Post